Moviesఅదితి ప్రేమ ముచ్చ‌ట్లు.. ఇంత‌కీ సిద్ధార్థ్ ను ఆమె ఎక్క‌డ పెళ్లాడ‌బోతుందో...

అదితి ప్రేమ ముచ్చ‌ట్లు.. ఇంత‌కీ సిద్ధార్థ్ ను ఆమె ఎక్క‌డ పెళ్లాడ‌బోతుందో తెలుసా?

గ‌త కొన్నేళ్ల నుంచి పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగి తేలుతున్న సెల‌బ్రిటీ జంట సిద్ధార్థ్, అదితి రావు హైదరి.. ఇటీవ‌ల ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే ఈ ప్రేమ ప‌క్ష‌కులు వైఫ్‌ అండ్ హ‌స్బెండ్ గా ప్ర‌మోట్ కాబోతున్నారు. అయితే తాజాగా వోగ్ ఇండియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో అదితి.. త‌న ప్రేమ‌, పెళ్లి ముచ్చ‌ట్లు పంచుకుంది. సిద్ధార్థ్ త‌న‌కు ఎక్క‌డ ప్ర‌పోజ్ చేశారు..? తాము పెళ్లి చేసుకోబోయేది ఎక్క‌డ‌..? వంటి ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను అదితి రివీల్ చేసింది.

మ‌హాస‌ముద్రం షూటింగ్ టైమ్ లో సిద్ధార్థ్ నాకు ప‌రిచ‌యం అయ్యాడు.. సిద్ధుని ఫ‌స్ట్ టైమ్‌ కలిసినప్పుడే అత‌ను నా వ్యక్తి అని నాకు అనిపించింది.. త‌క్కువ స‌మ‌యంలోనే ఇద్ద‌రం ఫ్రెండ్స్ అయ్యామ‌ని అదితి చెప్పుకొచ్చింది. మా నానమ్మ అంటే నాకెంతో ఇష్టం. ఆమెకు హైదరాబాద్ లో ఒక స్కూల్ ఉంది. నా బాల్యం మొత్తం ఆ స్కూల్ లోనే గ‌డిచింది. ఆ స్కూల్ తో నాకు స్పెష‌ల్ బాండ్ ఉంది. కొద్ది రోజుల క్రితం మా నానమ్మ చ‌నిపోయారు. ఈ విష‌యం సిద్దార్థ్ కు కూడా తెలుసు. ఒకరోజు ఆ స్కూల్ కి త్రీసుకెళ్ళమని అడగడంతో తీసుకువెళ్లాను. ఆ స్కూల్ లోనే సిద్దార్థ్ నాకు ప్రపోజ్ చేశాడు. మా నానమ్మ ఆశీస్సుల కోసమే అక్కడ ప్రపోజ్ చేసినట్లు తెలిపాడు అంటూ అదితి వివ‌రించింది.

ఇక ఈ క్ర‌మంలోనే పెళ్లి ప్ర‌స్తావ‌న కూడా వ‌చ్చింది. మీరు రాజస్థాన్‌లో పెళ్లి చేసుకుంటారా లేక డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటారా? అని ప్రశ్నించగా.. రెండు కాద‌ని అదితి న‌వ్వుతూ బ‌దులిచ్చింది. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని 400 ఏళ్లనాటి పురాతన రంగనాథస్వామి ఆలయం మా కుటుంబానికి చాలా ప్ర‌త్యేకం. సిద్ధార్థ్ తో నా ఎంగేజ్మెంట్ అక్క‌డే జ‌రిగింది. పెళ్లి కూడా అక్క‌డే చేసుకుంటాము. వెడ్డింగ్ డేట్ ఫిక్స్ చేశాక మేమే అధికారంగా ప్ర‌క‌టిస్తామ‌ని అదితి వెల్ల‌డించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news