‘టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషలలో పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అవుతుంది. త్రిబుల్ ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ ను చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. అటు ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాల శివ కసితో దేవర సినిమాను తెరకెక్కించారు. రెండు పార్టులుగా దేవర తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
ఎన్టీఆర్ ఆర్ట్స్ – యువసుధా ఆర్ట్స్ బ్యానర్లపై కొరటాల సన్నిహితుడు మిక్కిలినేని సుధాకర్ – నందమూరి కళ్యాణ్‌రామ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవర సినిమాకు రు. 300 కోట్ల వరకు ఖర్చుపెట్టినట్టు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా నాన్ థియేటర్ రైట్స్ ని నెట్‌ఫ్లిక్స్ రు. 155 కోట్లకు కొనుగోలు చేసిందట. ఎన్టీఆర్ కేటీఆర్ లోనే హైయెస్ట్ ఓటిటీ రైట్స్ ఈ సినిమాకి వచ్చాయి. ఇక ఈ సినిమాకు అన్ని ఏరియాలో ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా కంప్లీట్ అయిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల బ్రేక్ ఈవెన్ 130 కోట్ల వరకు ఉందంటున్నారు. అలాగే అన్ని భాషలకు కలుపుకునే ప్రపంచ వ్యాప్తంగా రు. 200 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో దేవర థియేటర్లలోకి దిగుతుందట.
పాన్ ఇండియా హీరోలకి రు. 200 కోట్లు టార్గెట్ అనేది చాలా చిన్నది. ఎన్టీఆర్ మార్కెట్ కూడా ఆ రేంజ్ లోనే ఉంది. అయితే సినిమాకి పాజిటివ్ టాక్ రావాల్సి ఉంది. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే అంచనాలకు మించి వసూళ్లు వస్తాయని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. మరికొందరు చెబుతున్న దాని ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలలో దేవరకు రు. 130 కోట్ల షేర్ రావడం అంటే చాలా ఎక్కువ అని చెబుతున్నారు. ఏది ఏమైనా దేవరగా ఎన్టీఆర్ విశ్వరూపం ఎలా ఉంటుందో ? తెలియాలంటే సెప్టెంబర్ 27 వరకు ఆగాల్సిందే.