సరిపోదా శనివారం నాని కెరీర్ లోనే పాన్ ఇండియా సినిమాగా భారీ ఎత్తున ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాని హీరో కావటం ప్రియాంక మోహన్ హీరోయిన్ కావటం తమిళ స్టార్ డైరెక్టర్ & నటుడు ఆయన ఎస్ జె సూర్య విలన్ గా నటించడం త్రిబుల్ ఆర్ లాంటి పాన్ ఇండియా హిట్ సినిమా తెరకెక్కించిన డివివి దానయ్య నిర్మాత కావడంతో సరిపోదా శనివారం పై ముందు నుంచే మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాకు మంచి హిట్ టాక్ వచ్చినా తొలి రోజు నార్త్ ఇండియాలో ఎదురుదెబ్బ తగిలింది.
ఈ సినిమా ప్రచారం కోసం నాని ముంబై – చెన్నై – బెంగళూరులో ప్రచారం చేశాడు. ముంబైలో చాలా కష్టపడ్డాడు.. నేషనల్ మీడియా ఛానళ్లు అన్నీ కవర్ చేశాడు.. ఇంటర్వ్యూలు ఇచ్చాడు. కానీ నాని కష్టానికి రిలీజ్‌కు ముందే ఫలితం దక్కలేదు. గ్రేటర్ ముంబై లో కేవలం 5 థియేటర్లు మాత్రమే ఈ సినిమాకు దక్కాయి. ముంబై మొత్తం మీద హిందీ వెర్షన్‌కు కేవలం ఐదు థియేటర్లు.. అది కూడా మార్నింగ్ షోలు లేవు అంటే సినిమాకు చాలా ఎదురుదెబ్బ అని చెప్పాలి.
అయినా కూడా అక్కడ బుకింగ్స్ జీరో.. ఇక ముంబైలో సరిపోదా శనివారం తెలుగు వెర్షన్‌కు కేవలం 9 స్క్రీన్లు మాత్రమే కేటాయించారు. వీటిలో కూడా ఎక్కడా ఓపెనింగ్స్ లేవు.. ఇక తమిళ వెర్షన్ గురించి మాట్లాడుకోవడం అనవసరం.. ఎక్కడా కనిపించలేదు. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో స్క్రీన్ కౌంట్ పెరుగుతుందన్న ఆశలు.. అంచనాలతో నిర్మాతలు ఉన్నారు. ఒకవేళ నార్త్ ప్రేక్షకులు నాని సినిమాలకు తిరస్కరిస్తే సినిమాకు పెట్టిన పబ్లిసిటీ ఖర్చు కూడా దండగే అవుతుంది.