టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 2 రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. డిసెంబర్ 6న పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర పుష్ప పార్ట్ 2 దడదడ లాడిపోనుంది. అక్టోబర్ చివరి నాటికి ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుందని.. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్‌పై దర్శకుడు సుకుమార్ ఫోకస్ పెడతాడని అంటున్నారు. అక్టోబర్ చివరి నాటికి పుష్ప 2 సినిమా షూటింగ్ మొత్తం పూర్తయితే.. ఆ తర్వాత బన్నీ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎవరితో అన్నది తేలాల్సి ఉంది.
ఇప్పటికే బన్నీతో సందీప్ రెడ్డి వంగ, త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలు అనౌన్స్ చేశారు. అయితే సందీప్ సినిమా ప్రారంభం కావడానికి మరో మూడు నాలుగు ఏళ్ల సమయం పట్టేలా ఉంది. దాంతో త్రివిక్రమ్ సినిమా సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. కానీ.. బన్నీతో సినిమా చేసేందుకు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కూడా లైన్లో ఉన్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇక త్రివిక్రమ్ కూడా బన్నీతో సినిమా కోసం కథపై కసరత్తులు మొదలు పెట్టేసాడు.
అటు అట్లీ కూడా షారుక్ ఖాన్‌తో జవాన్ సినిమా సూపర్ హిట్ కొట్టి.. బన్నీతో సినిమా కోసం కథ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే పుష్ప, పుష్ప 2 సినిమాల కోసం ఏకంగా నాలుగు సంవత్సరాల టైం వేస్ట్ చేసేశాడు బన్నీ. ఇప్పుడు పుష్ప 2 తర్వాత బన్నీ అట్లీకి కమిట్ అవుతాడా.. లేదా తనకు కలిసి వచ్చిన మాటలు మంత్రికుడు త్రివిక్రమ్‌తో ఫిక్స్ అయిపోతాడా.. అన్నది తేలాల్సి ఉంది. ఏది ఏమైనా బన్నీ ఇప్పుడు ఈ ఇద్దరు స్టార్ డైరెక్టర్ల మధ్య నలిగిపోతున్నాడు. మరి ఎవరికి ఓటేస్తాడో చూడాలి.