శ్రీదేవి విజయ్ కుమార్.. ఈ ముద్దుగుమ్మ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. నటులు విజయకుమార్, మంజుల దంపతుల కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన శ్రీదేవి.. తమిళంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా అనేక చిత్రాల్లో నటించింది. ప్రభాస్ డెబ్యూ మూవీ ఈశ్వర్ తో శ్రీదేవి హీరోయిన్ గా మారింది. ఈ సినిమా పరాజయం పాలైన శ్రీదేవి అందం, అభినయానికి మంచి మార్కులు పడ్డాయి
ఆ తర్వాత 2009 వరకు తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్ గా గడిపింది. కెరీర్ పీక్స్ లో ఉండగానే శ్రీదేవి పెళ్లి పీటలెక్కింది. రాహుల్ అనే బడా వ్యాపారవేత్తను 2009లో వివాహం చేసుకుంది. పెళ్లి అనంతరం ఇండస్ట్రీకి దూరమైన శ్రీదేవి.. 2016లో రూపిక అనే అమ్మాయికి జన్మనిచ్చింది. భర్త, కూతురుతో శ్రీదేవి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తోంది.
అయితే సినిమాలు చేయడం మానేసిన శ్రీదేవి గ్లామర్ మాత్రం చెక్కు చెదరలేదు. ఇప్పుడు ఆ అందమే శ్రీదేవికి మళ్లీ సినిమా అవకాశాలను తెచ్చిపెడుతోంది. 37 ఏళ్ల వయసులో హీరోయిన్ గా శ్రీదేవి రీఎంట్రీ ఇవ్వబోతోంది. సుందరకాండ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. నారా రోహిత్ ఇందులో హీరో కాగా.. నూతన డైరెక్టర్ వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహిస్తున్నారు.
చాలా వయసొచ్చినా పెళ్లి కాని అబ్బాయిగా ఇందులో నారా రోహిత్ నటించారు. ముదురు బ్రహ్మచారి పాత్ర కాబట్టి.. అతనికి జోడిగా శ్రీదేవిని హీరోయిన్ గా ఎంపిక చేశారు. వృత్తి వాఘని అనే మరో హీరోయిన్ కూడా ఉంది. చిత్రీకరణ పూర్తి చేసుకున్న సుందరకాండ మూవీ త్వరలోనే విడుదల కాబోతోంది. మరి లేటు వయసులో కథానాయికగా అదృష్టం పరీక్షించుకుంటున్న శ్రీదేవి ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.