డైరెక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత నటుడిగా మారిన వారిలో ఎస్. జె. సూర్య ఒకరు. స్పైడర్ మూవీతో విలన్ గా తన విశ్వరూపం చూపించిన సూర్య.. ఇటీవల కాలంలో తెలుగు, తమిళ భాషల్లో ప్రతినాయక పాత్రలకు కేరాఫ్ గా మారిపోయాడు. విలక్షణ నటనతో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న సూర్య.. త్వరలోనే సరిపోదా శనివారం మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు.
న్యాచురల్ స్టార్ నాని, ప్రియాంక మోహన్ జంటగా నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ను వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేయగా.. డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరించారు. ఆగస్టు 29న సరిపోదా శనివారం తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. అయితే ఈ చిత్రానికి ఎస్.జె. సూర్య తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఫిల్మ్ సర్కిల్స్ లో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం.. సరిపోదా శనివారంలో విలన్ గా నటించినందుకుగానూ సూర్య రూ. 10 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకున్నాడట. ఈ సినిమాకే కాదు.. తన రాబోయే గేమ్ ఛేంజర్, సర్దార్ 2 తదితర ప్రాజెక్ట్స్ కోసం కూడా సూర్య అంతే స్థాయిలో పారితోషికం పుచ్చుకుంటున్నాడట. సూర్య సక్సెస్ రేట్, హీరోల రేంజ్ లో క్రేజ్ ఉండటం కారణంగా నిర్మాతలు సైతం అతను అడిగినంత ఇచ్చేందుకు ఏమాత్రం వెనకడుగు వేయడం లేదని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.