తెలుగు సినిమా పరిశ్రమలో తల్లి కూతుర్లు ఇద్దరు హీరోయిన్లుగా నటించడం అరుదుగా జరిగింది. అయితే ఒకే హీరో వారిద్దరితోనూ రొమాన్స్ చేయడం అనేది చాలా విచిత్రం. ఇప్పటి తరం వాళ్లకు సారిక – శృతిహాసన్ శ్రీదేవి – జాన్వీ కపూర్ లాంటి మదర్ – డాటర్ హీరోయిన్ ల గురించి తెలుసు. ఇలా తల్లి కూతుర్లు ఇద్దరు సినిమాల్లో నటించారు. అలాంటివారిలో ముందు తరంలో చెప్పుకోవాల్సింది అమ్మాజీ – జయచిత్ర… జయచిత్ర తల్లి అమ్మాజీ. ఆమెను జయశ్రీ అని కూడా పిలుస్తారు.
అమ్మాజీ తెలుగులో రోజులు మారాయి.. దైవబలం లాంటి సినిమాలలో నటించారు. అయితే ఈ ఇద్దరితోను సీనియర్ ఎన్టీఆర్ రొమాన్స్ చేసి ఓ అరుదైన రికార్డు సృష్టించారు. బహుశా టాలీవుడ్ చరిత్రలో తల్లి కూతుర్లతో కలిసి నటించే ఏకైక హీరో ఎన్టీఆర్ ఒక్కరు మాత్రమే. జయచిత్ర 1976 లో వచ్చిన మా దైవం సినిమాతో మొదటిసారిగా ఎన్టీఆర్ తో జతకట్టింది. ఈ సినిమా ఓ బాలీవుడ్ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది.
ఈ సినిమాలో రామారావు ఒక జైలర్ పాత్రలో కనిపించారు.. ముద్దాయిలను మంచివాళ్లను చేయవచ్చు అని రామారావు నమ్ముతారు.. అంతేకాదు నేరాలు చేసిన వారిని జైలుకు తీసుకువచ్చి వారిని మంచి వాళ్ళని చేసి వారి జీవితాల్లో వెలుగు నింపుతారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ హీరోగా – జయశ్రీ హీరోయిన్గా నటించారు. అంతకంటే ముందే 1959లో దైవబలం అనే సినిమా వచ్చింది. ఈ సినిమాలో జయ చిత్రా తల్లి జయశ్రీ అలియాస్ అమ్మాజీ తో ఎన్టీఆర్ జతకట్టారు. ఈ సినిమాని పొన్నలూరు వసంత కుమార్ రెడ్డి నిర్మించగా ఆయనే దర్శకత్వం కూడా వహించారు.