Moviesటాలీవుడ్ స్టార్ హీరోల‌పై సూర్య సెటైర్లు… ఆ సినిమాల‌ను టార్గెట్ చేస్తూ..!

టాలీవుడ్ స్టార్ హీరోల‌పై సూర్య సెటైర్లు… ఆ సినిమాల‌ను టార్గెట్ చేస్తూ..!

కోలీవుడ్ నటుడు డైరెక్టర్ ఎస్ జె సూర్య తెలుగు వాళ్లకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఖుషి లాంటి బ్లాక్‌బ‌స్టర్ సినిమాతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. ఆ తర్వాత నటుడిగాను మెప్పించారు.. మహేష్ బాబుతో నాని సినిమాను తెరకెక్కించారు. అలాగే మహేష్ బాబు హీరోగా వచ్చిన స్పైడర్ సినిమాలో సూర్య విల‌నిజం బాగుంటుంది. అలాగే మానాడులో సూర్య నటనకు ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. ఇక ఇప్పుడు నాని హీరోగా తెరకెక్కుతున్న సరిపోదా శనివారం సినిమాలోని సూర్య విలన్ ఈ సినిమాలో నాని – సూర్య కెమిస్ట్రీ అదిరిపోతుందని ప్రచారం జరుగుతుంది.

ఇది ఇలా ఉంటే సరిపోతా శనివారం ప్రి రిలీజ్ వేడుకలో సూర్య చేసిన కొన్ని కామెంట్లు ఇప్పుడు టాలీవుడ్ లో చర్చనీయాంసంగా మారాయి. తమిళ్ భాషా సినిమా ప్రభావం తెలుగు ఇండస్ట్రీ పై గట్టిగా ఉందని తెలుగులో చాలామంది స్టార్ హీరోలు భాషాని చూసి సినిమాలు తీసి హిట్లు కొట్టారని సూర్య తెలిపారు. చిరంజీవి ఇంద్ర – ప్రభాస్ బాహుబలి 2 భాషా లాంటి కథ‌లే అని… బాలకృష్ణ కూడా భాషా టైపు కాన్సెప్ట్ తో చాలా సినిమాలు తీశారని సూర్య చెప్పారు. అంటే తెలుగు సినిమా యాక్షన్ కథలు అన్ని భాషా సినిమాకు కాపీలుగా సూర్య చెప్పినట్లు అయింది.

వాస్తవంగా చెప్పాలి అంటే భాషాన్ని చూసి తెలుగులో కొందరు హీరోలు తమకు కూడా ఇలాంటి సినిమాలు కావాలని యాక్షన్ సినిమాలు చేసిన మాట నిజం. ఎన్టీఆర్ సింహాద్రి కూడా అలాంటి కథే అనుకోవాలి. అయితే సూర్య తమిళ భాషాను చూసి తెలుగు స్టార్ హీరోలు వెంపర్లాడారు అన్నట్టుగా మాట్లాడటమే ఇక్కడ చర్చనీయాంశం అయింది. అయితే అదంతా ఒకప్పటి చరిత్ర.. ఇప్పుడు భారతదేశ మొత్తం తెలుగు సినిమా వెంట ఎలా వెంపర్లాడుతుందో చూస్తూనే ఉన్నాం.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news