సినీ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చి స్టార్ హోదాను అందుకున్న సౌత్ హీరోయిన్ల జాబితాలో కీర్తి సురేష్ ఒకరు. మలయాళ ఫిల్మ్ ప్రొడ్యూసర్ సురేష్ కుమార్, అలనాటి హీరోయిన్ మేనక దంపతులకు జన్మించిన కీర్తి సురేష్.. చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ప్రారంభించింది. 2013లో గీతాంజలి అని మలయాళం మూవీతో హీరోయిన్ గా మారింది. నేను శైలజ తో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. తొలి సినిమా తోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది.
అటు రెమో మూవీ ద్వారా తమిళ ప్రేక్షకులకు చేరువైంది. అనతి కాలంలోనే సౌత్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోయిన్ల లిస్టులో చోటు సంపాదించుకుంది. మహానటి చిత్రంతో కీర్తి సురేష్ స్టార్డమ్ రెండింతలు పెరిగింది. ప్రస్తుతం సౌత్ తో పాటు నార్త్ లో కూడా అవకాశాలు అందుకుంటూ హీరోయిన్ గా బిజీ షెడ్యూల్ మెయింటైన్ చేస్తుంది.
అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి సురేష్.. తన తొలి సంపాదన గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ. 4 నుంచి 5 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తున్న కీర్తి సురేష్ మొట్టమొదటి సంపాదన ఎంతో తెలుసా రూ. 500. అవును మీరు విన్నది నిజమే. చెన్నైలో ఫ్యాషన్ డిజైన్లో డిగ్రీ పూర్తి చేసిన కీర్తి సురేష్.. హీరోయిన్ కాకముందు కొద్ది రోజులు ఫ్యాషన్ షోస్ లో మోడల్స్ కు బట్టలు సరి చేసే పని చేసేదట.
అందుకుగానూ ఆమెకు వెతనంగా రూ. 500 ఇచ్చారట. అదే తన తొలి సంపాదన అని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో కీర్తి సురేష్ స్వయంగా చెప్పుకొచ్చింది. దీంతో ఆమె కామెంట్స్ సోసల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా, ప్రస్తుతం తెలుగులో కీర్తి సురేష్ కు సినిమాలు ఏమీ లేవు. కానీ తమిళంలో మాత్రం రివాల్వర్ రీటా, కన్నివేది అనే చిత్రాల్లో నటిస్తోంది. అలాగే త్వరలో బేబీ జాన్ మూవీతో బాలీవుడ్ లోకి అడుగు పెట్టబోతోంది.