టాలీవుడ్ లో కమర్షియల్ డైరెక్టర్ అనే ముద్ర పడటం కష్టం. కానీ ఒకసారి ఆ ముద్ర పడిన తర్వాత జర్నీ చాలా బాగుంటుంది.. మాస్ హీరోలు అందరూ ఆ డైరెక్టర్లతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఒకటి రెండు సినిమాలు.. ప్లాపులు అయినా కూడా వాళ్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. హరీష్ శంకర్ పై నిన్న మొన్నటి వరకు అలాంటి ముద్ర ఉండేది. ఒక సినిమాను కమర్షియల్ గా మాస్ మసాలా దినుసులతో ఎలా తెరకెక్కించాలో ? హరీష్ శంకర్‌కు బాగా తెలుసు. రీమేక్ కథని తన దైన స్టైల్ లో మార్చి తెలుగు ప్రేక్షకులకు మెచ్చేలా సినిమా తీయగలడు అన్న పేరు కూడా హరీష్ శంకర్‌కు ఉంది. అయితే తాజాగా రవితేజతో హరీష్ శంకర్ తెరకెక్కించిన మిస్టర్ బచ్చన్ సినిమా ఈ ఏడాదిలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ లలో ఒకటిగా నిలిచింది.
ఈ సినిమా ప్లాప్ అవడం ఒక ఎత్తు అయితే.. హరీష్ శంకర్ పై పర్సనల్గా భారీ ఎత్తున ట్రోలింగ్ జరిగింది. అతడి కెరీర్ కి కూడా భారీ ఎత్తున డ్యామేజీ జరిగింది. దీంతో ఇప్పుడు హరీష్ శంకర్ మరో హీరోను పట్టుకోవడం.. కొత్త సినిమా తెరకెక్కించటం చాలా కష్టం అని చెప్పాలి. అసలు గద్దల కొండ గణేష్ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత ఏకంగా ఐదేళ్లు గ్యాప్ తీసుకున్నారు.. ఇప్పుడు మిస్టర్ బచ్చన్ అంటూ వచ్చి ఘోరంగా దెబ్బ తిన్నారు… పైగా మిస్టర్ బిచ్చన్ ప్లాప్ అయ్యాక పవన్ కళ్యాణ్‌తో హరిశంకర్ తీసే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై కూడా అంచనాలు ఒక్కసారిగా తగ్గిపోయాయి.
ఇక ఈ సినిమాకు ముందు హరీష్ దర్శకత్వంలో ఒక సినిమా చేయాలని హీరో రామ్ అనుకున్నాడు. ఇప్పుడు రామ్ నటించిన డబుల్ ఇస్మార్ట్ సినిమా కూడా డిజాస్టర్ అయింది. అలాంటి టైంలో వీరిద్దరూ కలయికలో సినిమా వస్తుందని అనుకోవటం అత్యాశే అవుతుంది… ఇప్పుడు రామ్ మినహాయిస్తే యంగ్ హీరోలు ఎవరూ ఖాళీగా లేరు.. పవన్ కళ్యాణ్ ముందు కంప్లీట్ చేయాల్సినవి చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. అవన్నీ పూర్తయ్యక కానీ భగత్ సింగ్ సినిమా దగ్గరకు రాడు.. పైగా ఆయన పొలిటికల్ గా ఫుల్ బిజీ… ఇప్పటి వరకు ఉస్తాద్ కేవలం 20 శాతం షూటింగ్ మాత్రమే పూర్తయింది. హరిహర వీరమల్లు – ఓజీ పూర్తవ్వాలి. అప్పటివరకు హరిశంకర్ ఖాళీగా ఉండటం మినహా చేసేదేం లేదు.. ఏది ఏమైనా మిస్టర్ బచ్చన్ సినిమా రిలీజ్ కు ముందు వరకు ఎంతో క్రేజ్‌తో ఉన్న హరీశంకర్ ఈ సినిమా రిజల్ట్ దెబ్బతో ఘోరమైన అవమానం ఎదుర్కొన్న పరిస్థితి.