తాజాగా జరిగిన రావు రమేష్ మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చాలా విషయాలకు క్లారిటీ ఇచ్చేశాడు.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సందేహాలకు ఈ ఫంక్షన్ వేదికగా క్లారిటీ ఇచ్చాడు. బన్నీ ఎన్నికలకు ముందు నంద్యాలలో వైసిపి అభ్యర్థి తన స్నేహితుడు అయిన శిల్పా రవి కిషోర్ రెడ్డికి మద్దతుగా వెళ్లి ప్రచారం చేశారు. అప్పుడు మెగా ఫ్యామిలీతో పాటు మెగా ఫ్యామిలీ అభిమానులు కూడా బన్నీపై విమర్శలు చేశారు. నాగబాబు లాంటి వాళ్ళు సైతం మనోడే పరాయి వాడు అని కౌంటర్ ఇచ్చారు. అలాగే పుష్ప 2 సినిమా అనుకున్న టైంకు వస్తుందా రాదా అన్న సందేహం ఉంది. అలాగే డైరెక్టర్ సుకుమార్‌తో విభేదాలు ఈ మూడింటి మీద ఒకేసారి క్లారిటీ ఇచ్చేసాడు.
బన్నీ ముందుగా తన స్నేహితుడు శిల్పా రవి కిషోర్ కు మద్దతు ఇవ్వటం తనపై వస్తున్న విమర్శలు గురించి పరోక్షంగా కౌంటర్ ఇచ్చాడు. ఈ కౌంటర్ మళ్ళీ మెగా అభిమానులకు.. మెగా ఫ్యామిలీకి తాకేలా ఉంది. తనకు నచ్చితే తాను ఇష్టపడితే అండగా ఉండటానికి ఎక్కడికైనా వెళ్ళటానికి తాను వెనకాడను అని చెప్పేశాడు. నమ్మిన వారి కోసం.. స్నేహం చేసిన వారి కోసం మొహమాట పడకుండా సమస్యలకు జంకకుండా ధైర్యంగా వెళ్లేవాడే గొప్పవాడు అన్నట్టుగా క్లారిటీ ఇచ్చేశాడు. ఈ విషయంపై క్లారిటీ ఇవ్వడంతో బన్నీ మరోసారి మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా తన స్నేహితులు ఎవరైనా ఉంటే వారికి అయినా సపోర్ట్ చేస్తానని చెప్పకనే చెప్పేసినట్లయింది.
ఇక పుష్ప 2 డిసెంబర్ 6న వస్తుందని చెప్పేశాడు. సుకుమార్ పక్కన ఉండగా చెప్పాడు కాబట్టి ఈ విషయంలో కూడా క్లారిటీ వచ్చేసినట్టే.. ఇక మూడవ ముచ్చట ఏంటంటే సుకుమార్‌తో విభేదాలు గురించి ప్రచారం జరుగుతుంది. సుకుమార్‌ను బన్నీ హత్తుకున్నాడు. అయితే స్టేజ్ మీద సుకుమార్ ఓ మాట అన్నాడు ఒక్కోసారి ఒకరోజు చేయాల్సిన పని రెండు రోజులు చేశాం … ఇంకోసారి బన్నీ కోసం మరోసారి తనకోసం.. ఏం చేసిన అభిమానుల కోసమే అని చెప్పేశాడు. అంటే పుష్ప 2 సినిమా షూటింగ్ ఆలస్యం అయినా సినిమా క్వాలిటీ సూపర్ హిట్ చేసేందుకు.. వీరు ఎంత మాత్రం రాజీ పడటం లేదని అర్థమైంది. అలా ఈ మూడు విషయాలలో బన్నీ క్లారిటీ ఇచ్చేశాడు.