టాలీవుడ్ లో ఎప్పుడు అన్ని రంగాలలోనూ కొత్తనీరు వచ్చి చేరుతుంది. అయితే అదే టైంలో సీనియర్లపై గౌరవం.. వారి సినిమాల పట్ల భారీ అంచనాలు ఉంటాయి. అయితే ఇటీవల కాలంలో కొందరు సీనియర్ దర్శకులు తమ మీద ఉన్న అంచనాలు అందుకోవటంలో దారుణంగా విఫలం అవుతున్నారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరు మాటల మంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్. చాలామందితో గురూజీ అని పిలిపించుకునే స్థాయి త్రివిక్రంది.. ఈ దర్శకుడు ఈ ఏడాది సూపర్ స్టార్ మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమా తీసి అందరినీ నిరాశపరిచారు.
మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే అదిరిపోవాలి.. కానీ గుంటూరు కారం సినిమాతో త్రివిక్రమ్ మెప్పించలేకపోయాడు. మరో సీనియర్ దర్శకుడు బోయపాటి శ్రీను కూడా ఇంతే..! బాలయ్యతో అఖండ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఈ దర్శకుడు అదే చేత్తో రామ్ హీరోగా స్కంద లాంటి భారీ డిజాస్టర్ ఇచ్చాడు. అసలు అఖండ సినిమా తీసింది బోయపాటేనా ? అన్న సందేహాలు వచ్చేలా చేశాడు. మరో సినియర్ అయిన కొరటాల శివకు అసలు ప్లాప్ అంటే ఏమిటో తెలియదు. మిర్చి – శ్రీమంతుడు – జనతా గ్యారేజ్ – భరత్ అనే నేను ఇలా అన్ని సూపర్ డూపర్ హిట్ సినిమాలు చేశారు.
ఒక్కసారిగా ఆచార్యతో బ్రేకులు పడ్డాయి.. ప్రస్తుతం కొరటాల ఆశలు అన్ని దేవర మీదే ఉన్నాయి. ఇక పూరి జగన్నాథ్ – హరీష్ శంకర్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. పూరి జగన్నాథ్ ఐదారు ప్లాప్ సినిమాలకు ఒక హిట్ సినిమా ఇస్తున్నారు. హరిశంకర్ ఐదేళ్ల తర్వాత వచ్చి మిస్టర్ బచ్చన్ లాంటి నాసిరకం సినిమా తీస్తారని ఎవరు ఊహించలేదు. ఏది ఏమైనా సీనియర్ దర్శకులు ఎవరు తమ స్థాయికి తగిన సినిమాలో అయితే తీయడం లేదు అన్నది వాస్తవం.