Moviesనాగ‌చైత‌న్య - శోభిత పెళ్లి ఆ దేశంలోనే… రిసెప్ష‌న్ ఎక్క‌డంటే..?

నాగ‌చైత‌న్య – శోభిత పెళ్లి ఆ దేశంలోనే… రిసెప్ష‌న్ ఎక్క‌డంటే..?

అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య – యంగ్ హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల‌ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. రెండేళ్లుగా సీక్రెట్ గా ప్రేమించుకుంటున్న ఈ జంట ఇటీవల నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. నాగచైతన్య – శోభిత దూళిపాళ్లతో ఆగస్టు 8న నిశ్చితార్థం చేసుకున్నారు. నిశ్చితార్థం తర్వాత వీరిద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు ? అని చాలామంది ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. నాగచైతన్య గతంలో స్టార్ హీరోయిన్ సమంతను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఏడు ఎనిమిది సంవత్సరాలు పాటు ఎంతో గుట్టుగా ప్రేమించుకున్న ఈ జంట 2017లో పెళ్లి పీటలు ఎక్కారు.

పెళ్లయిన నాలుగేళ్లకే ఇద్దరు విడిపోయారు.. అక్టోబర్ 2021 లో సమంత – నాగచైతన్య విడాకులు తీసుకుంటున్నట్టు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చారు. అనంతరం నాగచైతన్య …శోభితతో ప్రేమలో పడ్డాడు. వీరు సీక్రెట్ గా ప్రేమించుకుని ఎట్టకేలకు ఎంగేజ్మెంట్ చేసుకుని ప్రేమలో ఉన్నట్టు క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉంటే నాగచైతన్య – శోభిత పెళ్లి ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జరగనుందని తెలుస్తోంది. నాగచైతన్య కుటుంబ సభ్యులు నాగార్జున కుటుంబ సభ్యులతో పాటు కొందరు సన్నిహితుల సమక్షంలో ఈ పెళ్లి ప్యారిస్ లో జరగనుందట. అనంతరం పెళ్లి తర్వాత హైదరాబాదులో గ్రాండ్గా రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news