Moviesనంద‌మూరి వ‌సుంధ‌ర‌కు పిచ్చ‌పిచ్చ‌గా న‌చ్చేసిన బాల‌య్య సినిమా ఇదే…!

నంద‌మూరి వ‌సుంధ‌ర‌కు పిచ్చ‌పిచ్చ‌గా న‌చ్చేసిన బాల‌య్య సినిమా ఇదే…!

నందమూరి నటసింహం బాలకృష్ణ తన కెరీర్ లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలలో నటించారు. బాలయ్య ఇప్పటికే 108 సినిమాలలో నటించారు. ప్ర‌స్తుతం బాల‌య్య బాబి ద‌ర్శ‌క‌త్వంలో చేస్తోన్న సినిమా 109వ సినిమా. ఇక బాల‌య్య త‌న కెరీర్‌లో చేసిన 108 సినిమాలలో కొన్ని హిట్ సినిమాలు ఉన్నాయి.. కొన్ని ప్లాప్ సినిమాలు ఉన్నాయి. కొన్ని ఇండస్ట్రీ హిట్ సినిమాలు కూడా ఉన్నాయి. కొన్ని సినిమాలు ఒక మోస్త‌రుగా ఆడినా బాలయ్యకు మంచి పేరు కూడా తెచ్చిపెట్టాయి.

అలాంటి వాటిలలో 2002లో వివి. వినాయక్‌ దర్శకత్వంలో వచ్చిన చెన్నకేశవరెడ్డి ఒక‌టి. బాలయ్యకు జోడిగా టబూ.. శ్రియ నటించారు. ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేశారు. ఈ సినిమా అంటే బాలయ్య భార్య నందమూరి వసుంధరకు చాలా ఇష్టమట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఈ సినిమా దర్శకుడు వినాయక్‌కి చెప్పారట. ఈ విషయాన్ని వినాయక్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. మరి ముఖ్యంగా సీనియర్ బాలయ్య పాత్ర చేస్తున్నన్ని రోజులు బాలయ్య చాలా ఎంజాయ్ చేస్తూ నటించారట.

ప్రతిరోజు షూటింగ్ పూర్తయి ఇంటికి వెళ్ళాక కూడా బాలయ్య చాలా సంతోషంగా ఉండేవారని.. ఈ పాత్ర గురించే తనతో ఎక్కువగా చర్చించే వారిని కూడా వసుంధర దేవి వినాయక్ తో చెప్పారట. సీనియర్ బాలయ్య పంచికట్టు… మీసగట్టు పాత్ర అంటే వసుంధరకు చాలా ఇష్టం అట.. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర జస్ట్ హిట్ సినిమాగా మాత్రమే నిలిచింది. యావ‌రేజ్ టాక్‌తో కూడా 42 కేంద్రాలలో వంద రోజులు పూర్తి చేసుకుంది. అయితే ఈ సినిమాలో బాలయ్య నటనకు మంచి మార్కులు పడ్డాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news