Moviesఎన్టీఆర్ - ప్ర‌శాంత్ నీల్ బ‌డ్జెట్‌… నెంబ‌ర్ చూస్తే నోట‌మాట రాదంతే..?

ఎన్టీఆర్ – ప్ర‌శాంత్ నీల్ బ‌డ్జెట్‌… నెంబ‌ర్ చూస్తే నోట‌మాట రాదంతే..?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ – ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ వార్ 2 సినిమాలోను నటిస్తున్నారు. అనంతరం ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కే సినిమా కోసం ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా లాంఛ్‌ చేశాడు ఎన్టీఆర్. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇప్పుడు ఈ సినిమా బడ్జెట్ డీటెయిల్స్ బయటికి వచ్చాయి. ఈ నెంబర్లు వింటే కాస్త షాక్ కావాల్సిందే. ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్‌ సినిమా దాదాపు 350 కోట్ల రూపాయల బడ్జెట్ తో రాబోతుందని సమాచారం. ఇదే కనుక నిజమైతే ఎన్టీఆర్ కెరియర్ లోనే కాదు … ప్రశాంత్ నీల్‌ కెరీర్ లో కూడా బడ్జెట్ పరంగా భారీ సినిమా అవుతుంది.

ప్రభాస్ తో సలార్‌ సినిమా తీశాడు ప్రశాంత్ నీల్‌. ఈ సినిమాకు అటు ఇటుగా 270 కోట్ల రూపాయలు ఖర్చయింది. ఎన్టీఆర్ సినిమాను తన డ్రీమ్ ప్రాజెక్టుగా ప్ర‌క‌టించాడు నీల్‌. ఈ సినిమాకు 350 కోట్ల రూపాయలు బడ్జెట్ కోట్‌ చేసినట్టు తెలుస్తోంది. నిజానికి ఈ కథను ఇప్పటివరకు నీల్‌ తెరమీదకు తీసుకు రాకపోవటానికి కూడా బడ్జెట్ కారణమని తెలుస్తుంది. ఈ కథకు బడ్జెట్ చాలా ఎక్కువ అవుతుందని… అందుకే నీల్ ఇన్నేళ్లుగా ఈ స్టోరీని తెరమీదకి తీసుకురాకుండా అలా పక్కన పెడుతూ వచ్చారంటూ గతంలోనే స్టోరీలు వచ్చాయి.

ఎట్టకేలకు మైత్రి మూవీ మేకర్స్ ఇప్పుడు ఖర్చుకు వెనకాడకుండా ఈ సినిమాను నిర్మించేందుకు ముందుకు వచ్చింది. దీంతో ప్రశాంత్ నీల్‌.. ఈ కథను బయటకు తీశాడు. అలా ఎన్టీఆర్ తో తన డ్రీమ్ ప్రాజెక్టును తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమా గురించి పూర్తి వివరాలు త్వరలోనే బయటకు వెళ్ళడి కానున్నాయి. 2026 సమ్మర్ కానుకగా ఈ క్రేజీ ప్రాజెక్టును రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news