Moviesఆ స్టార్ హీరో కాపురంలో నిత్యమీనన్ చిచ్చు పెట్టిందా..?

ఆ స్టార్ హీరో కాపురంలో నిత్యమీనన్ చిచ్చు పెట్టిందా..?

నిత్యా మీనన్ నిజంగానే ఆ హీరో కాపురంలో చిచ్చుపెట్టిందా.. సోషల్ మీడియాలో వైరల్ అయిన వార్తల్లో ఎంత నిజం ఉంది అనేది ఇప్పుడు చూద్దాం.. హైట్ తక్కువే అయినప్పటికీ తన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న నిత్యా మీనన్ ఈ మధ్యనే నేషనల్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు కూడా అందుకుంది.. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ అప్పట్లో ఓ స్టార్ హీరోతో ప్రేమాయణం సాగించిందని ఒక టాక్ వినిపించింది.ఇక ఆ హీరో ఎవరో కాదు కన్నడ స్టార్ కిచ్చా సుదీప్.. ఈయన తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈగ మూవీలో విలన్ గా చేశారు.

అయితే అలాంటి సుదీప్ తో నిత్యామీనన్ ప్రేమలో పడిందని, వీరిద్దరూ సీక్రెట్ గా డేటింగ్ చేస్తున్నారనే వార్తలు అప్పట్లో వినిపించాయి. అయితే ఇది ఒకప్పటి వార్త అయినప్పటికీ మళ్ళీ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది. గతంలో సుదీప్ తన భార్య రాధికతో గొడవలు పడడానికి కారణం నిత్యామీనన్ అనే టాక్ కూడా వినిపించింది. అలాగే సుదీప్ కి పెళ్ళై పాప ఉంది అనే విషయం తెలిసినా కూడా నిత్యా మీనన్ ఆయన్ని కోరుకుందట. అలా వీరిద్దరి మధ్య ఉన్న ప్రేమ కారణంగా సుదీప్ తన భార్యకు విడాకులు ఇచ్చి నిత్యా మీనన్ ని పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ సుదీప్ తన భార్యకు విడాకులు ఇవ్వాలనే నిర్ణయాన్ని మార్చుకున్నారు..

ఇక సుదీప్ తన భార్యతో ఫ్యామిలీ కోర్ట్ లో విడాకులకు కూడా అప్లై చేశారు. ఇక దాంతో అప్పట్లో వీరి విడాకుల వార్తలు మీడియాలో టాక్ ఆఫ్ ది మీడియా గా మారిపోయాయి.అంతే కాదు నిత్యా మీనన్ వల్లే పచ్చని జంట విడిపోతుంది అని ఆమెపై అందరు నెగటివ్ కామెంట్స్ చేశారు. అయితే ఆ తర్వాత విడాకులను రద్దు చేసుకున్నారు. ఇక వీరు విడాకులు తీసుకోకపోవడానికి కారణం సుదీప్ కూతురు అనే టాక్. కూతురు కారణంగానే భార్యాభర్తలు విడాకులు తీసుకోవాలనే నిర్ణయాన్ని మార్చేసుకున్నట్టు తెలిసింది. ఏది ఏమైనప్పటికీ అప్పట్లో నిత్యామీనన్ సుదీప్ ల వ్యవహారం మాత్రం కన్నడలో దుమారం సృష్టించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news