గోవా బ్యూటీ ఇలియానా ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంది. కానీ ఒకప్పుడు అయితే ఈ హీరోయిన్ తన అంద చందాలతో ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది. చాలామందికి ఈ హీరోయిన్ లక్కీగా మారిపోయింది. అలా దేవదాసు మూవీ తో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి మూవీ తోనే సక్సెస్ అయ్యింది. ఆ తర్వాత వరుస సినిమాల్లో ఆఫర్స్ వచ్చాయి. అంతేకాకుండా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన పోకిరి మూవీ ఇండస్ట్రీ హిట్ కొట్టడంతో ఇలియానాకి మరింత క్రేజ్ వచ్చింది. అయితే ఇలియానా పేరు చెప్పగానే అందరికీ ఆమె నడుమే గుర్తుకు వస్తుంది.
ఎవరినైనా పొగిడే సమయంలో అచ్చం నీ నడుము ఇలియానాలా ఉంది అని అంటూ ఉంటారు.అంత ఫేమస్ అయింది ఇలియానా నడుము..అయితే అలాంటి ఇలియానా ఓ డైరెక్టర్ కోరిక తీర్చలేక ఆత్మహత్య చేసుకొని చనిపోవాలని చూసిందట. అయితే ఈ విషయాన్ని అప్పట్లో ఓ ఇంటర్వ్యూ లో ఇలియానా చెప్పడంతో ఇది కాస్త మీడియాలో సంచలనం సృష్టించింది. అయితే ఇలియానా ఆ డైరెక్టర్ పేరు బయట పెట్టకుండానే నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కొంతమంది నన్ను లైంగికంగా చాలా వేధించారు.అందులో కొంత మంది తెలుగు దర్శకులు కూడా ఉన్నారు. ఇక ఓ డైరెక్టర్ కోరిక తీర్చలేక నేను ఇంటికి వచ్చి సూసైడ్ చేసుకోవాలి అనుకున్నాను.
కానీ ఆ సమయంలో నా కుటుంబం గుర్తుకు వచ్చి నా నిర్ణయాన్ని మార్చుకున్నాను.లేకపోతే ఆ రోజే నేను ఈ లోకాన్ని విడిచి వెళ్లే దాన్ని..కానీ ఎవరో ఒకడు మూర్ఖుడి కోసం నా ప్రాణాలు ఎందుకు తీసుకోవడం అని ఆలోచించా.. నా ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించి మళ్లీ నా టాలెంట్ తో సినిమాల్లో అవకాశాలు సంపాదించాను అంటూ ఇలియానా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. అయితే ఇలియానా మాటలు విన్నా ఆమె అభిమానులు ఇంతకీ ఇలియానాని లైంగికంగా ఇబ్బంది పెట్టిన ఆ టాలీవుడ్ డైరెక్టర్ ఎవరబ్బా అని కామెంట్స్ పెడుతున్నారు.