Moviesమూడు సార్లు చిరంజీవి సినిమాల‌ను రిజెక్ట్ చేసి అవ‌మానించిన‌ స్టార్ హీరోయిన్...

మూడు సార్లు చిరంజీవి సినిమాల‌ను రిజెక్ట్ చేసి అవ‌మానించిన‌ స్టార్ హీరోయిన్ ఎవ‌రు..?

మెగాస్టార్ చిరంజీవి అంటే తెలియ‌ని వారుండ‌రు. సామాన్యుడి నుంచి అస‌మాన్యుడిగా ఎదిగిన సూప‌ర్ హీరో ఆయ‌న. ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేక‌పోయినా తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో నెం. 1గా ఎదిగారు. అటువంటి చిరంజీవి ప‌క్క‌న హీరోయిన్ గా న‌టించాల‌న్న‌ది ఎంద‌రో న‌టీమ‌ణులకు ఉన్న డ్రీమ్‌. గ‌త నాలుగున్న‌ర ద‌శాబ్దాల నుంచి చిరంజీవితో ఎంతో మంది హీరోయిన్లు జ‌త‌క‌ట్టారు. అయితే ఓ స్టార్ హీరోయిన్ మాత్రం ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా మూడు సార్లు చిరంజీవి సినిమాల్లో ఛాన్స్ వ‌స్తే రిజెక్ట్ చేసి అవ‌మానించింద‌ట‌.

ఇంత‌కీ ఆ హీరోయిన్ మ‌రెవ‌రో కాదు గౌత‌మి. తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌కు గౌత‌మి అత్యంత సుప్ర‌సిద్ధురాలు. 90వ ద‌శ‌కంలో ఆమె స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. టాలీవుడ్ లో కృష్ణ‌, వెంక‌టేష్‌, నాగార్జున వంటి అగ్ర హీరోల‌తో గౌత‌మి స్క్రీన్ షేర్ చేసుకుంది. అయితే చిరంజీవితో క‌లిసి న‌టించే అవ‌కాశం వ‌చ్చినా గౌత‌మి చేయ‌లేదు. ఇందుకుగ‌ల కార‌ణాన్ని ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో గౌత‌మి బ‌య‌ట‌పెట్టింది.

చిరంజీవిగారితో న‌టించ‌నందుకు నేను చాలా బాధ‌ప‌డ్డాను. మూడు సార్లు ఆయ‌న సినిమాల్లో యాక్ట్ చేసే ఛాన్స్ వ‌చ్చింది. కానీ ప్రతిసారి వేరే చిత్రాలతో బిజీగా ఉండడం వల్ల డేట్స్ అడెస్ట్ అయ్యేవి కావు. రజనీకాంత్ సినిమాతో పాటు మరి కొన్ని చిత్రాలకు సైన్ చేయడం వల్ల చిరంజీవిగారితో న‌టించ‌లేక‌పోయాను. నా వ‌ల్ల ఆయ‌న మూడు సార్లు అప్‌సెట్ అయ్యారు అంటూ గౌత‌మి చెప్పుకొచ్చింది. అయితే తాను రిజెక్ట్ చేసిన చిరంజీవి సినిమాలు ఏవో మాత్రం గౌత‌మి రివీల్ చేయ‌లేదు.

కాగా, గౌతమి 1998లో సందీప్ భాటియా అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకుని సుబ్బలక్ష్మి అనే కూతురికి జ‌న్మ‌నిచ్చింది. అయితే పెళ్లైన ఏడాదికే సందీప్‌, గౌత‌మి విడాకులు తీసుకున్నారు. ఆ త‌ర్వాత‌ కమల్ హాసన్‌తో 2005 నుండి 2016 వరకు రిలేషన్‌షిప్‌లో ఉంది. 2016లో అతనితో కూడా గౌత‌మి తన సంబంధాన్ని ముగించింది. ప్ర‌స్తుతం కూతురు సుబ్బలక్ష్మితో క‌లిసి చెన్నైలో ఉంటూ సింగిల్ లైఫ్ ను లీడ్ చేస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news