మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ హీరోగా కరుణాకరణ్ డైరక్షన్ లో వచ్చిన సినిమా తేజ్ ఐలవ్యూ. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్లో కె.ఎస్ రామారావు నిర్మించిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమా ఫ్లాపులతో సతమతమవుతున్న సాయి ధరం తేజ్ కు హిట్ ఇచ్చిందా లేదా అన్నది ఈనాటి సమీక్షలో చూద్దాం
కథ :
చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన తేజ్ (సాయి ధరం తేజ్) పెదనాన్న(జయప్రకాష్)తో కలిసి ఉంటాడు. అయితే ఓ హత్య విషయమై తేజ్ జైలుకి వెళ్తాడు. అక్కడే పెద్దవాడై రిలీజ్ అవుతాడు. జైలు నుండి వచ్చిన తేజ్ ను ఇంట్లోకి రానివ్వడు పెదనాన్న దీనితో హైదరాబాద్ వెళ్లి ఏదో ఒకటి చేద్దాం అనుకుంటాడు. ఆ ట్రైన్ జర్నీలో నందిని (అనుపమ పరమేశ్వరన్) పరిచయం అవుతుంది. ఆమెను చూడగానే ప్రేమలో పడిన తేజ్ ఆమెను ఇంప్రెస్ చేయాలని చూస్తుంటాడు. కొంతమంది స్నేహితులను ఏర్పరచుకుని మ్యూజిక్ బ్యాండ్ ట్రూప్ రన్ చేస్తుంటాడు. ఈలోగా అనుకోని విధంగా ఓ యాక్సిడెంట్ లో నందిని తన గతాన్ని మర్చిపోతుంది. నందినికి గతాన్ని గుర్తుచేయాలని తేజ్ చాలా ప్రయత్నాలు చేస్తాడు. తన ప్రేమ ద్వారా నందినిని ఎలా మళ్లీ మాములు మనిషిని చేశాడు..? నందిని, తేజ ల ప్రేమ ఎలా ముగిసింది అన్నది సినిమా కథ.
నటీనటుల ప్రతిభ :
సాయి ధరం తేజ్ ఎప్పటిలానే తన రెగ్యులర్ పర్ఫార్మెన్స్ కనబరిచాడు. లవ బోయ్ గా జస్ట్ ఓకే అనిపించాడు. అనుపమ అందం, అభినయం ఆకట్టుకుంది. ప్రేయసిగా ఆమె మెప్పించింది. ఫ్రెండ్స్ గ్యాంగ్ లో వైవా హర్ష మిగతా వారంతా కామెడీ పంచారు. జయ ప్రకాశ్ లాంటి వారు ఎప్పటిలానే సహజ నటనతో ఆకట్టుకున్నారు.
సాంకేతికవర్గం పనితీరు :
ఆండ్రూ సినిమాటోగ్రఫీ చాలా బాగుందని చెప్పొచ్చు. ప్రతి ఫ్రేం చాలా డీటైల్డ్ గా చూపించారు. గోపి సుందర్ మ్యూజిక్ కూడా సినిమాకు హెల్ప్ అయ్యింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అలరించింది. కథ, కథనాల్లో దర్శకుడు ప్రతిభ చాటలేకపోయాడు. కరుణాకరణ్ స్టైల్ ఆఫ్ టేకింగ్ కనిపించలేదు. రొటీన్ కథ, కథనాలతో వచ్చాడని అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం రిచ్ గా ఉన్నాయి.
విశ్లేషణ :
హీరో, హీరోయిన్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్.. ఆమె కోసం ఏదైనా చేసే హీరో తెగింపు.. ఇంతలోనే ఆమెకు కష్టం రావడం.. ఆ కష్టం నుండి హీరో ఆమెను కాపాడటం ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయి. అయితే ఇందులో హీరోయిన్ యాక్సిడెంట్ లో తన గతం మర్చిపోతుంది. వసంతకోకిల సినిమాలో శ్రీదేవి, కమల్ హాసన్ లా ఆమెకు గతాన్ని గుర్తుచేసేలా సాయి ధరం తేజ్ చేస్తాడు.
అయితే ఎంచుకున్న కథను నడిపించిన కథనం కరుణాకరణ్ ఇదవరకు సినిమాల ప్రభావం కనిపిస్తుంది. ప్రభాస్ డార్లింగ్ సినిమా ఎఫెక్ట్ తేజ్ ఐలవ్యూ మీద చాలా ఉందనిపిస్తుంది. కథ పాతదే.. కథనం కూడా పాత పద్ధతిలోనే నడిపించారు. వరుస అపజయాలతో సతమతమవుతున్న తేజూ ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు.
చెప్పాలనుకున్న కథను ఎంట్రటైనింగ్ గా చెబుతున్నామని మాత్రమే ఆలోచించిన దర్శకుడు తాను ఇదవరకే ఇలాంటి పంథా కొనసాగించాడని గుర్తుచేసుకోలేదు. తేజూ ఈసారైనా హిట్ కొడతాడని ఎదురుచూసిన మెగా ఫ్యాన్స్ కు నిరాశే కలిగిందని చెప్పొచ్చు.
ప్లస్ పాయింట్స్ :
అనుపమ
సినిమాటోగ్రఫీ
మ్యూజిక్
మైనస్ పాయింట్స్ :
రొటీన్ స్టోరీ
స్క్రీన్ ప్లే
అవుట్ డేటెడ్ కామెడీ
బాటం లైన్ :
తేజ్ ఐల్వయూ.. మళ్లీ నిరాశపరచిన మెగా మేనళ్లుడు..!
రేటింగ్ : 2/5