బాలయ్య ఛీ కొట్టిన కథతో సూపర్ హిట్ అందుకున్న పవన్ కళ్యాణ్.. ఇంతకీ ఆ సినిమా ఏదంటే..?
సినిమా పరిశ్రమలో కథలు అటు ఇటు మారుతూనే ఉంటాయి. ఒక హీరో వదిలేస్తే మరొక హీరో ఆ కథను పట్టుకోవడం అనేది చాలా కామన్. అలా గతంలో నటసింహం నందమూరి బాలకృష్ణ ఛీ కొట్టిన కథతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా చేసి సూపర్ డూపర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు అన్నవరం. సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రానికి భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించాడు.
ఇందులో పవన్ కళ్యాణ్ కు జోడిగా ఆసిన్.. చెల్లెలుగా సంధ్య నటించారు. వేణుమాధవ్, శివ బాలాజీ, ఆశిష్ విద్యార్థి, నాగ బాబు తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకు రమణ గోగుల సంగీతం అందించారు. 2006 డిసెంబర్ 29న విడుదలైన అన్నవరం భారీ విజయాన్ని నమోదు చేసింది
పాజిటివ్ టాక్ తో మంచి వసూళ్లను రాబట్టింది. అప్పటికే జానీ, గుడుంబా శంకర్, బాబు, బంగారం చిత్రాలతో వరుస పరాజయాలతో సతమతం అవుతున్న పవన్ కళ్యాణ్.. అన్నవరంతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. అయితే అన్నవరం చిత్రానికి ఫస్ట్ ఛాయిస్ పవన్ కళ్యాణ్ కాదు. డైరెక్టర్ భీమినేని శ్రీనివాసరావు ఈ సినిమాను మొదట బాలయ్యతో తీయాలని భావించారట. ఆయన్ను కలిసి స్టోరీ కూడా చెప్పారట.
కానీ బాలయ్యకు అన్నవరం కథ అంతగా నచ్చలేదట. పైగా అప్పటికే సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో చాలా సినిమాలు చేసి ఉండటం వల్ల బాలయ్య కథ విన్న వెంటనే నో చెప్పేశాడు. కట్ చేస్తే అదే స్టోరీతో పవన్ కళ్యాణ్ అన్నవరం చేసి సూపర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ఈ మూవీలో హీరోయిన్ గా మొదట అనుష్కను తీసుకోవాలని భావించారు. అయితే ఇతర ప్రాజెక్ట్స్ వల్ల ఆమె నో చెప్పడంలో ఆసిన్ హీరోయిన్ గా ఎంపిక అయింది.