Moviesఆ డైరెక్టర్ శృతిహాసన్ ని నిజంగానే టార్చర్ చేశారా..?

ఆ డైరెక్టర్ శృతిహాసన్ ని నిజంగానే టార్చర్ చేశారా..?

శృతిహాసన్.. ప్రస్తుతం వరుస హిట్స్ కొడుతూ ఫ్లాపుల్లో ఉన్న హీరోలకు హిట్స్ అందిస్తుంది అని పేరు తెచ్చుకుంది. ఈమె ఒకప్పుడు ఫ్లాపుల్లో ఉన్న పవన్ కళ్యాణ్ కి గబ్బర్ సింగ్ సినిమాతో హిట్ ఇచ్చినట్టు అప్పట్లో వార్తలు వినిపించాయి. ఎందుకంటే అప్పటివరకు పవన్ కళ్యాణ్ చేసిన సినిమాలన్నీ డిజాస్టర్ అయ్యాయి. కానీ గబ్బర్ సింగ్ హిట్ అయ్యేసరికి ఆ క్రెడిట్ మొత్తం శృతిహాసన్ కి ఇచ్చి లక్కీ హీరోయిన్ గా మార్చేశారు.ఇక గత ఏడాది వాల్తేరు వీరయ్య తో చిరంజీవికి,సలార్ మూవీ తో ప్రభాస్ కి కూడా హిట్స్ ఇచ్చింది.అలా శృతిహాసన్ ని లక్కీయెస్ట్ హీరోయిన్ గా టాలీవుడ్ ప్రేక్షకులు పిలుస్తున్నారు.

ప్రస్తుతం శృతిహాసన్ అడివి శేష్ తో డెకాయిట్ అనే మూవీ చేస్తుంది. అలాగే సలార్ -2 లో కూడా ఈ హీరోయిన్ నటిస్తోంది. అయితే ఈ విషయాలు పక్కన పెడితే.. శృతిహాసన్ ని నిజంగానే ఆ డైరెక్టర్ వేదించారా.. ఆ సినిమా నుండి శృతిహాసన్ తప్పుకోవడానికి కారణం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. శృతిహాసన్ ని వేదించినట్టు టాక్ వచ్చిన ఆ డైరెక్టర్ ఎవరంటే.. బోయపాటి శ్రీను.. కేఎస్ రామారావు నిర్మాతగా ఎన్టీఆర్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన దమ్ము సినిమా అందరూ చూసే ఉంటారు. అయితే ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా త్రిష,సెకండ్ హీరోయిన్ గా కార్తిక నటించింది.

కానీ త్రిష కంటే ముందు మెయిన్ హీరోయిన్ గా శృతిహాసన్ ని చిత్ర యూనిట్ అనుకున్నారట. ఈ సినిమా సమయంలో శృతిహాసన్ కి బోయపాటి శ్రీనుకు మధ్య గొడవలు వచ్చి ఈ మూవీ నుండి శృతిహాసన్ ని తీసేసినట్టు తెలుస్తోంది. బోయపాటి శ్రీను శృతిహాసన్ ని షూటింగ్ విషయంలో వేదించారనే టాక్ ఫిలిం సర్కిల్స్ లో బలంగా వినిపించింది. కానీ అందులో ఎలాంటి నిజం లేదని శృతిహాసన్ కి బోయపాటి శ్రీనుకి మధ్య చిన్న గొడవ కూడా జరగలేదు.

ఫిలిం సర్కిల్స్ లో వైరల్ అయిన న్యూస్ మొత్తం రూమరే అంటూ రీసెంట్ గా క్లారిటీ ఇచ్చారు దమ్ము సినిమా నిర్మాత కేఎస్ రామారావు.. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..బోయపాటి శ్రీనుకి శృతిహాసన్ కి మధ్య ఎలాంటి గొడవ జరగలేదు.కానీ శృతిహాసన్ వేరే సినిమాల్లో బిజీగా ఉండడం వల్ల డేట్స్ అడ్జస్ట్ కావు అని ఈ సినిమాని రిజెక్ట్ చేసింది.కానీ ఈ సినిమాలో శృతిహాసన్ ని తీసుకుందామని అందరూ అనుకున్నారు. కానీ ఆమె డేట్స్ లేవని రిజెక్ట్ చేయడంతో ఆమె ప్లేస్ లో త్రిషను తీసుకున్నాం.ఇక డైరెక్టర్ తో శృతిహాసన్ కి గొడవలు అయ్యాయి అనే దాంట్లో ఎలాంటి నిజం లేదు అంటూ కేఎస్ రామారావు క్లారిటీ ఇచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news