టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రాల్లో గీత గోవిందం ముందు వరుసలో ఉంటుంది. నేటితో ఈ సినిమా విడుదలై ఆరేళ్లు పూర్తి అయ్యాయి. ఈ నేపథ్యంలోనే గీత గోవిందం విశేషాలు మరోసారి తెరపైకి వచ్చాయి. పరశురామ్ డైరెక్ట్ చేసిన ఈ రొమాంటిక్ కామెడీ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. నాగబాబు, సుబ్బరాజు, రాహుల్ రామకృష్ణ, అన్నపూర్ణ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించగా.. గోపి సుందర్ సంగీతం అందించారు.
అల్లు అరవింద్ సమర్పణలో గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించిన గీత గోవిందం.. 2018 ఆగస్టు 15న విడుదలై ప్రేక్షకులను నుంచి సానుకూల సమీక్షలను అందుకుంది. రొటీన్ కథే అయినప్పటికీ.. డైరెక్టర్ పరశురామ్ దాన్ని కొత్త ప్రజెంట్ చేయడంలో సక్సెస్ అయ్యాయి. సినిమాకు విజయ్ దేవరకొండ-రష్మిక ప్రధాన బలంగా నిలిచారు. వారిద్దరి మధ్య నడిచే లవ్ & కామెడీ ట్రాక్, సాంగ్స్, ఫ్యామిలీ ఎలిమెంట్స్, పరశురామ్ డైరెక్షన్ మెయిన్ హైలెట్స్ గా నిలిచాయి.
ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న గీత గోవిందం మూవీ.. బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే వసూళ్లను సొంతం చేసుకుంది. రూ. 5 కోట్ల బడ్జెట్ తో సినిమాను నిర్మిస్తే.. రిలీజ్ తర్వాత ఫుల్ రన్ లో రూ. 132 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అటు విజయ్ ఇటు రష్మికకు భారీ స్టార్డమ్ ను తెచ్చిపెట్టింది. గీత గోవిందం తర్వాత రష్మిక వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుస అవకాశాలతో కెరీర్ ను పరుగులు పెట్టిస్తోంది. మరోవైపు విజయ్ సైతం హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు.