Moviesగుడ్ న్యూస్.. త‌ల్లి కాబోతున్న లావ‌ణ్య త్రిపాఠి.. మెగా ఫ్యామిలీలోకి మ‌రో...

గుడ్ న్యూస్.. త‌ల్లి కాబోతున్న లావ‌ణ్య త్రిపాఠి.. మెగా ఫ్యామిలీలోకి మ‌రో వార‌సుడు..?!

అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠి గత ఏడాది మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ను పెళ్లాడి కొణిదెల వారింటికి కోడలిగా వెళ్లిన సంగతి తెలిసిందే. మిస్టర్, అంతరిక్షం వంటి చిత్రాల్లో వరుణ్ తేజ్‌, లావణ్య త్రిపాఠి జంటగా నటించారు. ఈ సినిమాలు చేసే క్రమంలోనే ఇరువురి మధ్య ప్రేమ చిగురించింది. దాదాపు ఆరేళ్లు ప్రేమించుకున్న ఈ జంట.. 2023లో పెద్దలు అంగీకారంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. ఇటలీలో వీరి మ్యారేజ్ చాలా గ్రాండ్ గా జరిగింది.

వివాహం అనంతరం వరుణ్ తేజ్ కెరీర్ పరంగా ఫుల్ బిజీ అయ్యాడు. అయితే లావణ్య త్రిపాఠి మాత్రం సినిమాల ఎంపికలో మునిపటంత జోరు చూపించడం లేదు. ఇదిలా ఉంటే.. తాజాగా లావణ్య త్రిపాఠికి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విషయం ఏమిటంటే.. లావణ్య త్రిపాఠి తల్లి కాబోతుందట. ప్రస్తుతం ఆమె ప్రెగ్నెంట్ అని.. త్వరలోనే మెగా ఫ్యామిలీలో మరో వారసుడు రాబోతున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఇటీవల వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే ఆ సమయంలో లావణ్య త్రిపాఠి కాస్త బొద్దుగా కనిపించడం.. పైగా తన స్టమక్ ను చీరతో కవర్ చేసుకోవడం వంటి అంశాలు అనుమానాలకు తెరలేపాయి. అలాగే గత నెల రోజుల నుంచి సోషల్ మీడియాలో లావణ్య త్రిపాఠి యాక్టివ్ గా ఉండ‌టం లేదు. కొత్త సినిమాలపై ప్రకటన కూడా లేదు. ఈ పరిణామాల‌న్నీ లావణ్య త్రిపాఠి ప్రెగ్నెంట్ అయిందనే ప్ర‌చారానికి బ‌లం చేకూర్చాయి. మ‌రి ఈ ప్ర‌చారం ఎంతవరకు నిజమో తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news