నెగటివ్ టాక్ వచ్చినా స్టార్ హీరోల సినిమాలకు కమర్షియల్ గా లాస్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. హీరోకు ఉన్న క్రేజ్ దృష్ట్యా టాక్ తో సంబంధం లేకుండా కొన్ని చిత్రాలు థియేటర్స్ వద్ద మంచి కలెక్షన్స్ రాబడుతుంటాయి. అటువంటి మూవీస్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఓ సినిమా అట్టర్ ఫ్లాప్ టాక్ తో ఏకంగా రూ. 100 కోట్లు కొల్లగొట్టింది. ఇంతకీ ఆ మూవీ మరేదో కాదు కాటమరాయుడు.
కిషోర్ కుమార్ పార్థాసాని డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, శృతి హాసన్ జంటగా నటించారు. కమల్ కామరాజు, శివబాలాజీ, అజయ్, నాజర్, ప్రదీప్ రావత్, తరుణ్ అరోరా తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. నార్త్ స్టార్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ పై శరత్ మరార్ సినిమాను నిర్మించగా.. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.
తమిళ సినిమా వీరం ఆధారంగా తెరకెక్కిన కాటమరాయుడు.. భారీ అంచనాల నడుమ 2017లో విడుదలై తొలి ఆట నుంచే ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది. రొటీన్ కథ, కథనాలతో ఈ చిత్రం పవన్ కళ్యాణ్ అభిమానులను మరియు ప్రేక్షకులను తీవ్రంగా నిరాశ పరిచింది. పవన్ పాత సినిమాల్లోని సీన్లను రిపీట్ సినిమాకు మరింత మైనస్ అయింది. అయితే ఫ్లాప్ టాక్ వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ స్టార్ ఇమేజ్ దృష్ట్యా కాటమరాయుడు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించింది.
థియేట్రికల్ రన్ ముగిసే సమయానికి రూ. 62.15 కోట్ల షేర్, రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టింది. కానీ కాటమరాయుడు బ్రేక్ ఈవన్ మాత్రం అవ్వలేకపోయింది. మొత్తం టార్గెట్ లో 80 శాతం కంటే తక్కువ రికవరీ చేసి.. దేశీయ మార్కెట్లలో ఫ్లాప్ గా మరియు ఓవర్సీస్ లో డిజాస్టర్ నిలిచింది. ఓవర్సీస్ బయ్యర్లు మరియు ఎగ్జిబిటర్లు కలిపి ఏకంగా రూ. 6.5 కోట్లకు పైగా నష్టపోయారు.