పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో గబ్బర్ సింగ్ మూవీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. కొమరం పులి, తీన్మార్, పంజా వంటి బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లతో సతమతం అవుతున్న పవన్ కళ్యాణ్.. గబ్బర్ సింగ్ తో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ కొట్టి మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. బాలీవుడ్ లో సూపర్ డూపర్ హిట్ గా దబాంగ్ చిత్రానికి రీమేక్ ఇది. శ్రీ పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకం పై బండ్ల గణేష్ నిర్మించిన గబ్బర్ సింగ్ సినిమాకు హరీష్ శంకర్ దర్శకుడిగా వ్యవహరించాడు.
హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తే.. పవన్ కళ్యాణ్ ఢీ కొనే ప్రతినాయకుడి పాత్రను అభిమన్యు సింగ్ పోషించాడు. సుహాసిని, నాగినీడు, రావు రమేశ్, కోట శ్రీనివాసరావు తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. 2012 మే 11న విడుదలైన గబ్బర్ సింగ్.. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఫుల్ రన్ లో రూ. 63 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది.
అయితే సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ బర్త్డే కావడంతో.. ఈ రోజు గబ్బర్ సింగ్ ను రీరిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే గబ్బరి సింగ్ మూవీకి సంబంధించి ఎవరికీ తెలియని ఓ ఇంట్రెస్టింగ్ సీక్రెట్ తెరపైకి వచ్చింది. విషయం ఏంటంటే.. ఈ చిత్రంలో విలన్ సిద్దప్ప నాయుడు పాత్రకు ఫస్ట్ ఛాయిస్ అభిమన్యు సింగ్ కాదు. ఒకప్పుడు స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన అబ్బాస్ ను గబ్బర్ సింగ్ లో ప్రతినాయకుడి పాత్రకు ఎంపిక చేయాలని హరీష్ శంకర్ భావించాడట.
హీరోగా ఫేడౌట్ అయ్యాక 2011లో నితిన్ యొక్క మారో మూవీలో విలన్ గా అబ్బాస్ నటించాడు. అందులో ఆయన యాక్టింగ్ నచ్చడంలో పవన్ కళ్యాణ్ సినిమా కోసం అబ్బాస్ తో హరీష్ శంకర్ సంప్రదింపులు జరిపారు. కానీ అబ్బాస్ మాత్రం ఇంట్రెస్ట్ చూపలేదు. అప్పటికే అతను సినిమాలు వదిలేసి ఫారెన్ వెళ్లిపోయాడు. అక్కడ స్థిరపడ్డాడు. ఆ కారణంగానే గబ్బర్ సింగ్ ను అబ్బాస్ రిజెక్ట్ చేశాడట. ఏదేమైనా ఈ సినిమాను అబ్బాస్ చేసుంటే.. ఆయన కెరీర్ ఇప్పుడు మరోలా ఉండేది అనడంలో సందేహం లేదు.