Moviesఆ తెలుగు హీరోయిన్ మీద మోజుతో ఫ్లాట్లు, విల్లాలు కొనిచ్చిన అంబానీ..?

ఆ తెలుగు హీరోయిన్ మీద మోజుతో ఫ్లాట్లు, విల్లాలు కొనిచ్చిన అంబానీ..?

ఈ హీరోయిన్ అందానికి అప్పట్లో దుబాయ్ షేక్ లు ఫిదా అయ్యేవారట. ముఖ్యంగా ఈమె అందాన్ని చూసి వాళ్ళు కోట్లకు కోట్లు డబ్బులు ఇస్తామని వెంటపడే వారట. అయితే అప్పట్లో ఒక కోటి అంటేనే 100 కోట్లతో సమానం.. ఆ రోజుల్లో ఎంతోమంది వెంటపడ్డా కూడా వారెవరిని వాడుకొని వదిలేయకుండా అసలు నాకు అవసరం లేదు అని ఆ హీరోయిన్ పక్కకి నెట్టేసిందట. ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు జయలలిత.. జయలలిత అంటే అందరూ తమిళనాడు సీఎం హీరోయిన్ జయలలిత అనుకుంటారు.

కానీ ఆమె పేరుతో సౌత్ ఇండస్ట్రీలో మరో నటి కూడా ఉంది. ఆమె పేరు కూడా జయలలితనే.ఇక ఈమె శరత్ బాబుతో సహజీవనం చేసి పిల్లల్ని కూడా కనాలనుకుంది.కానీ అది కుదరలేదు. అయితే జయలలిత ప్రస్తుతం సినిమాల్లో బామ్మ పాత్రలు,అమ్మ పాత్రలు, అలాగే సీరియల్స్ లో బామ్మ పాత్రల్లో చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.సినిమాల ద్వారా ఎన్నో డబ్బులు సంపాదించిన ఈమె కొంతమంది చేతిలో మోసపోయి ఉన్న ఆస్తులన్ని పోగొట్టుకుందట. అయితే రీసెంట్ గా కరాటే కళ్యాణి కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జయలలిత పాల్గొంది.

ఆ సమయంలో కరాటే కళ్యాణి అడిగిన ప్రశ్నలన్నింటికీ జవాబులు ఇచ్చింది. ఇందులో భాగంగా అప్పట్లో మీ అందానికి ధీరుభాయ్ అంబానీ మనసు పడి మీకు ముంబైలో ఒక ఫ్లాట్ రాసిచ్చారని విన్నాం నిజమేనా అని అడిగితే.. ఇప్పటివరకు ఈ విషయం ఎక్కడా చెప్పలేదు. అవును అది నిజమే. అంతేకాదు ఒక మ్యాన్షన్ హౌస్ ని కూడా నా పేరు మీద రాశారు.అయితే మా ఇద్దరి మధ్య బంధం పెళ్లి వరకు వెళితే బాగుండు. కానీ అది పెళ్లి వరకు వెళ్లలేదు. అందుకే ఆయనతో ఎక్కువ రోజులు బంధం కొనసాగలేదు. ఇక ఆయన చనిపోయాక నాకు ఇచ్చిన మ్యాన్షన్ హౌస్ ఆయన సెక్రటరీకి అప్పజెప్పాను. అలా అయినా అది అమ్మితే వచ్చిన డబ్బులు వారి ఇంటి వాళ్లకు అప్పచెప్పుతారని.

ఎందుకంటే ఆయనే చనిపోయాక ఆయన సొమ్ము మాత్రం నాకెందుకు పరుల సొమ్ము పాము వంటిది అని నేను వద్దని చెప్పాను. ఇక ముంబైలో రాసిచ్చిన ఒక ఫ్లాట్ లో ఒక రూమ్ లో నేను ఉండి వేరే రూమ్స్‌ని అద్దెకి ఇచ్చాను. అప్పట్లోనే ఆ రూమ్ రెంట్ 40,000 వచ్చేవి. కానీ ఆ తర్వాత అక్కడ ఫ్లాట్ అమ్మేసి హైదరాబాదులో ఇల్లు కొనుక్కున్నాను. ఇక శరత్ బాబు ఇచ్చిన ఆస్తిలో కూడా నేను చాలా వరకు సేవా కార్యక్రమాలకు ఇచ్చేసాను అంటూ జయలలిత కరాటే కళ్యాణ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను చెప్పింది.

అయితే ధీరుభాయ్ అంబానీ లాంటి పెద్ద ధనవంతుడే జయలలిత అందానికి దాసుడయ్యాడు అంటే అప్పట్లో జయలలిత రేంజ్ ఏవిధంగా ఉండేది.. ఆమె అందం ఎలా ఉండేదో అని ఈ విషయం తెలిసిన నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు.ఇక జయలలిత ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చాలా సినిమాల్లో హీరోయిన్ గా అలాగే కొన్ని సినిమాల్లో ఐటెం డాన్సర్ గా కూడా చేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news