మాస్ మహారాజా రవితేజ, స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన తాజా చిత్రం మిస్టర్ బచ్చన్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. జగపతి బాబు, సచిన్ ఖేడేకర్ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించగా.. మిక్కీ జె. మేయర్ సంగీతం అందించాడు.
యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న మిస్టర్ బచ్చన్ ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 15న విడుదల కాబోతోంది. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ రైడ్‌కు రీమేక్‌గా ఈ సినిమా వస్తుందని బలమైన టాక్ నడుస్తోంది. పూరి జగన్నాథ్ – రామ్ పోతినేని కాంబో మూవీ డబుల్ ఇస్మార్ట్ తో పోటీ డపుతున్న మిస్టర్ బచ్చన్ పై మంచి అంచనాలే ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగానే ప్రీ రిలీజ్ బిజినెస్ ఎక్స్ లెంట్ గా జరిగింది.
తాజాగా మిస్టర్ బచ్చన్ బిజినెస్ లెక్కలు బయటకు వచ్చాయి. నైజాంలో రూ. 12 కోట్లు, సీడెడ్ లో రూ. 4 కోట్లు, ఆంధ్రాలో రూ. 12 కోట్లకు ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ సేల్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ. 29 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగితే.. వరల్డ్ వైడ్ గా రూ. 32 కోట్లు బిజినెస్ జరిగింది. ఓవర్సీస్ లో రూ. 2 కోట్లకు థియేట్రికల్ హక్కులు అమ్ముడుపోయాయి.
ఇక మిస్టర్ బచ్చన్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 33 కోట్లుగా ఉంది. మరి ఈ టార్గెట్ ను రీచై రవితేజ హిట్ అందుకుంటాడా? లేదా? అన్నది చూడాలి. కాగా, ఆగస్టు 14 వ తేదీ సాయంత్రం నుండి మిస్టర్ బచ్చన్ ప్రీమియర్ షోలు ప్రారంభం కాబోతున్నాయి. ప్రీమియర్ షోస్ కి సంబందించిన అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రారంభం అయ్యాయి.