నాగ చైతన్య,శోభితల పెళ్లి జరగడానికి మరికొద్ది రోజులు ఉంది అని రీసెంట్గా నాగార్జున ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టారు. ఇక నాగచైతన్య శోభితల ఎంగేజ్మెంట్ జరగడంతో వీరికి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఒక్కొక్కటిగా మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే వీరిద్దరూ ఎలా కలుసుకున్నారు..వీరి ప్రేమ చిగురించింది..ఎక్కడ వీరి బంధం బలపడింది అంటూ ఇలా ఎన్నో వార్తలు మీడియాలో వైరల్ అవుతున్న వేళ నాగచైతన్య ని పెళ్లి చేసుకోవడానికి శోభితకి నాగార్జున ఒక షాకింగ్ కండిషన్ పెట్టారు అంటూ సోషల్ మీడియాలో ఒక వైరల్ న్యూస్ వినిపిస్తోంది.
మరి ఇంతకీ నాగచైతన్య తో పెళ్లి కోసం శోభిత ఎలాంటి కండిషన్ కి ఒప్పుకుంది అనేది ఇప్పుడు చూద్దాం.. సమంత నాగచైతన్యలు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న సమయంలో సమంతకు అక్కినేని ఫ్యామిలీ ఎలాంటి కండిషన్స్ పెట్టలేదు. దాంతో పెళ్లయిన తర్వాత కూడా సినిమాల్లో సామ్ రాణించింది.అయితే ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ అక్కినేని ఫ్యామిలీ లో గొడవలు పెట్టింది అనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. కానీ ఈ విషయంలో నాగచైతన్య మాత్రం అలాంటిదేమీ లేదు.ఈ వెబ్ సిరీస్లో సమంత మంచి పాత్రలో నటించింది అని మెచ్చుకున్నారు.
కానీ ఇన్సైడ్ వర్గాల టాక్ మాత్రం వీరి మధ్య గొడవకు అదే వెబ్ సిరీస్ కారణం అంటారు.ఈ సిరీస్ లో సమంత బోల్డ్ నెస్ అక్కినేని కుటుంబానికి నచ్చలేదట. అయితే సమంత కంటే బోల్డ్ గా ఉండే శోభిత ధూళిపాళ్ల ని నాగార్జున కోడలుగా ఎలా అంగీకరించారని చాలామందికి అనుమానం రావచ్చు.అయితే పెళ్లికి ముందు ఎన్ని చేసినా కూడా పెళ్లయిన తర్వాత భర్త అత్తింటి వాళ్ళు చెప్పే వాటికి కట్టుబడి ఉండాలి. అయితే శోభితా ధూళిపాలకు అక్కినేని ఫ్యామిలీ ఎలాంటి కండిషన్ పెట్టలేదట.
అయితే ఏ సినిమాలో అయినా సరే ఎంత బోల్డ్ గా నటించాల్సి వచ్చినా సరే ముందుగా నాగచైతన్య తో ఈ విషయం చర్చించి అది ఆయనకు ఓకే అయితేనే నటించమని చెప్పారట. ఇక నాగచైతన్య కి కూడా ఇదే కండిషన్ పెట్టారట. ఒక సినిమా కోసం కమిట్మెంట్ ఇచ్చారంటే ఇద్దరు ఒక మాట అనుకునే దాన్ని ఒప్పుకోండి. లేకపోతే ఇద్దరి మధ్య అహం పెరిగిపోయి గొడవలు తలెత్తుతాయి. అందుకే ఏ విషయం అయినా సరే ఇద్దరు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి అంటూ నాగార్జున కాబోయే కోడల్ని, నాగచైతన్య ని కూర్చోబెట్టి మరీ ఈ కండిషన్ ని పెట్టినట్టు తెలుస్తోంది.