Moviesఆ హీరోయిన్‌కి మహేష్ బాబు లిప్ లాక్… రచ్చ చేసిన నమ్రత..?

ఆ హీరోయిన్‌కి మహేష్ బాబు లిప్ లాక్… రచ్చ చేసిన నమ్రత..?

సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు అన్నింటికీ తలవంచితేనే ఇండస్ట్రీలో రాణించగలరు..ఆ పాత్ర నేను చేయను ఈ పాత్రలో నేను నటించను అంటే ఇండస్ట్రీలో రాణించలేరు. అయితే కొంతమంది హీరోయిన్లు తమకు తామే కట్టుబాట్లు పెట్టుకొని చాలా వరకు హిట్ సినిమాల్లో అవకాశాలు కోల్పోయిన సందర్భాలు అనేకం చూసాం. ఎందుకంటే వాళ్లు గ్లామరస్ పాత్రలు చేయకుండా తమ పాత్ర ఇక్కడి వరకే అని రాసిపెట్టుకొని ఉంటారు. అలా కొన్ని పాత్రల వరకే చేయగలుగుతారు. అయితే కొంతమంది హీరోలు కూడా ఈ విషయంలో కండిషన్స్ అప్లై చేస్తారట. అప్పట్లో మహేష్ బాబు ఓ హీరోయిన్ కి లిప్ లాక్ ఇచ్చిన విషయం టాలీవుడ్ మీడియాలో తెగ వైరల్ అయింది.

అయితే అప్పటివరకు హోమ్లీ హీరోగా కనిపించిన ఈయన ఒక్కసారిగా ఆ హీరోయిన్ తో లిప్ లాక్ సీన్,నడుము గిల్లడం వంటి సన్నివేశాల్లో నటించడం కారణంగా ఆయనలో కూడా రొమాంటిక్ యాంగిల్ ఉంది అని దర్శక నిర్మాతలు గ్రహించారు.ఇక ఆయన ఎవరో కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు.. రాజకుమారుడు, వంశీ,యువరాజు, టక్కరి దొంగ, మురారి,ఒక్కడు, నాని, అర్జున్, నిజం వంటి సినిమాల్లో నటించారు. కానీ అప్పటివరకు ఇయన్ని చూపించన ఒక రొమాంటిక్ యాంగిల్ లో కృష్ణవంశీ అతడు మూవీలో చూపించారు.

ఇక అతడు సినిమా ఇప్పటికి బుల్లితెర మీద వచ్చినా చాలామంది అభిమానులు ఇష్టంగా చూస్తారు.ఇక ఈ సినిమాలో బావ మరదళ్ల మధ్య రొమాంటిక్ సన్నివేశాలు చాలానే ఉంటాయి.అలా నడుమ గిల్లడం, ముద్దు పెట్టుకోవడం వంటివి మీరు ఇప్పటికే ఎన్నోసార్లు ఈ సినిమాలో చూసే ఉంటారు. అయితే అతడు సినిమాలో త్రిష బావ పాత్రలో మహేష్ బాబు నటిస్తారు. అయితే రాజీవ్ కనకాల అసలు బావ అయినప్పటికీ ఆయన మరణించడంతో ఆయన పాత్రలోకి మహేష్ బాబు వారి కుటుంబంలోకి ఎంట్రీ ఇస్తారు.అలా మహేష్ బాబు,త్రిష మధ్య బావ మరదళ్ల సరసం ఉంటుంది.

అయితే ఈ సినిమాలో “పిలిచినా రానంటావా” అనే పాటలో త్రిష నడుము గిల్లడం అక్కడక్కడ ముద్దు పెట్టుకోవడం వంటి సన్నివేశాలు ఉంటాయి. అయితే ఈ సన్నివేశాలు చూసిన సమయంలో నమ్రత మహేష్ బాబు తో పెద్ద రచ్చ చేసిందట. ఇలాంటి సన్నివేశాల్లో ఎందుకు నటించావు అని గోలగోల చేసిందట. కానీ నటుడిగా ప్రతి ఒక్క సన్నివేశంలో నటించాలి కదా..నువ్వు సినిమా ఇండస్ట్రీలోనే ఉంటున్నావు. నీకు తెలియదా అని మహేష్ బాబు కూడా చెప్పారట. అయితే అప్పట్లో త్రిష మహేష్ బాబుకి ఎక్కడ క్లోజ్ అయిపోతుందోనన్న భయంతో హడావిడిగా పెళ్లి చేసుకుంది అనే టాక్ టాలీవుడ్ లో వినిపించిన సంగతి మనకు తెలిసిందే. అలా అతడు సినిమా సమయంలో త్రిష మహేష్ బాబుకి సంబంధించిన కొన్ని సన్నివేశాలను చూసి నమ్రత రచ్చ చేసినట్టు టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని వార్తలు వినిపించాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news