Moviesవేదంలో వేశ్య పాత్ర చేయొద్ద‌ని అనుష్క‌కు వార్నింగ్ ఇచ్చిన స్టార్ హీరో...

వేదంలో వేశ్య పాత్ర చేయొద్ద‌ని అనుష్క‌కు వార్నింగ్ ఇచ్చిన స్టార్ హీరో ఎవ‌రు..?

సౌత్‌ లేడీ స్టార్ అనుష్క శెట్టి త‌న కెరీర్ లో ఎన్నో అద్భుత‌మైన చిత్రాలు చేసింది. మ‌రెన్నో గుర్తుండిపోయే పాత్ర‌ల‌ను పోషించింది. వేదం మూవీలో స‌రోజ అనే వేశ్య పాత్ర కూడా ఆ కోవ‌కే చెందుతుంది. క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేసిన ఆంథాల‌జీ ఫిల్మ్ ఇది. ఈ చిత్రంలో అల్లు అర్జున్, అనుష్క శెట్టి, మంచు మనోజ్, మనోజ్ బాజ్‌పేయి, శరణ్య పొన్వన్నన్, నాగయ్య, దీక్షా సేథ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌ను పోషించారు.

ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్‌పై శోబు యార్లగడ్డ మరియు ప్రసాద్ దేవినేని నిర్మించిన వేదం మూవీ 2010లో విడుద‌లై విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. ఎన్నో అవార్డులు గెలుచుకుంది. అయితే వేదంలో వేశ్య అనుష్క న‌టించ‌బోతోంద‌ని వార్త‌లు రాగానే అభిమానులు, సినీ ప్రియుల‌తో పాటు ఆమె కోస్టార్స్ కూడా షాకైపోయారు. ఎందుకంటే, అప్ప‌టికే అనుష్క టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా స‌త్తా చాటుతోంది. అరుంధతి వంటి సినిమాతో హీరోల‌తో స‌మానంగా క్రేజ్ సంపాదించుకుంది.

అలాంటి అనుష్క వేశ్య‌గా యాక్ట్ చేయ‌బోతోంద‌ని తెలియ‌డంతో.. అంద‌రికీ మైండ్ బ్లాక్ అయిపోయింది. అనుష్క బిగ్ మిస్టేక్ చేస్తుంద‌ని.. వేదం త‌ర్వాత ఆమె కెరీర్ క్లోజ్ అవుతుంద‌ని మాట్లాడుకున్నారు. ఈ క్ర‌మంలోనే అనుష్క క్లోజ్ ఫ్రెండ్‌, స్టార్ హీరో ప్ర‌భాస్ కూడా ఆమెకు కాల్ చేశాడ‌ట‌. వేశ్య క్యారెక్ట‌ర్ చేయొద్ద‌ని.. ఒక స్టార్ హీరోయిన్ అలాంటి పాత్ర చేస్తే కెరీర్ పై ప్ర‌తికూల ప్ర‌భావం ప‌డుతుంద‌ని సీరియ‌ర్ వార్నింగ్ ఇచ్చాడ‌ట‌. కానీ అనుష్క మాత్రం ప్ర‌భాస్ మాట‌లు ప‌ట్టించుకోలేదు.

క‌ట్ చేస్తే వేదంలో అనుష్క పోషించిన స‌రోజ పాత్ర ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంది. విమ‌ర్శ‌కులు సైతం అనుష్క న‌ట‌న‌కు ఫిదా అయ్యారు. అలాగే ఉత్త‌మ న‌టిగా వేదం మూవీకి గానూ ఆమె సౌత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డును సొంతం చేసుకుంది. అనుష్క పోషించిన‌ వ‌న్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్ట‌ర్ గా స‌రోజ పాత్ర నిలిచింది. పైగా వేదం త‌ర్వాత ఆమె కెరీర్ మ‌రింత ఊపందుకోవ‌డం విశేషం.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news