Moviesతన ఇంట్లో ఉండకూడదని కళ్యాణ్ రామ్‌ని వెళ్లగొట్టిన హరికృష్ణ… అస‌లేం జ‌రిగింది..?

తన ఇంట్లో ఉండకూడదని కళ్యాణ్ రామ్‌ని వెళ్లగొట్టిన హరికృష్ణ… అస‌లేం జ‌రిగింది..?

నందమూరి హరికృష్ణ మొదటి భార్య కొడుకు కళ్యాణ్ రామ్ కి,హరికృష్ణ కి మధ్య నిజంగానే అంత పెద్ద గొడవ జరిగిందా.. ఎందుకు ఇంట్లో ఉండకుండా బయటి దేశాలకు వెళ్ళిపోమని హరికృష్ణ కళ్యాణ్ రామ్ కి కండిషన్ పెట్టారు అనేది ఇప్పుడు చూద్దాం..కళ్యాణ్ రామ్ ని ఇంటి నుండి వెళ్లిపోమని హరికృష్ణ చెప్పడానికి కారణం కళ్యాణ్ రామ్ సినిమాకు నిర్మాతగా చేస్తానంటే ఆ విషయంలో భయపడిన హరికృష్ణ ఇంటి నుండి వెళ్లిపోమని చెప్పారట. ఇక అసలు విషయంలోకి వెళ్తే..

వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన లాహిరి లాహిరి లాహిరిలో మూవీలో హరికృష్ణ మెయిన్ రోల్ చేశారు. అయితే ఈ సినిమాలో హరికృష్ణ కోసం మొదట వైవిఎస్ చౌదరి కళ్యాణ్ రామ్ ని సంప్రదించారట. అయితే తమ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు అయినటువంటి వైవిఎస్ చౌదరి అలా నోరు తెరిచి అడిగేసరికి కళ్యాణ్ రామ్ ఎలాగైనా మా నాన్నను ఒప్పిస్తాను అని మాట ఇచ్చారట. ఇక హరికృష్ణ దగ్గరికి వెళ్లి ఈ విషయం చెబితే ఈ సినిమాకి నేను ఒప్పుకోను ఎందుకంటే నాకు వైవిఎస్ చౌదరి మీద నమ్మకం లేదు అని అన్నారట.

కానీ కళ్యాణ్ రామ్ మాత్రం నువ్వు ఈ సినిమాలో చేయాలి నాన్న అని అన్నారట.అయినా కూడా హరికృష్ణ రిజెక్ట్ చేశారట. ఆ తర్వాత కొద్ది రోజులకు కళ్యాణ్ రామ్ నేరుగా డైరెక్టర్ వైవిఎస్ చౌదరి ఇంటికి వెళ్లి మీరు ఈ సినిమా తీయండి. నేను బడ్జెట్ పెడతాను ఈ సినిమాకి నేనే నిర్మాత అని అన్నారట. ఇదే విషయాన్ని కళ్యాణ్ రామ్ తన తండ్రితో చెప్పగా కోపంతో హరికృష్ణ నీకు ఇంకా నిర్మాత గా చేసే అంత మెచ్యూరిటీ రాలేదు. సినిమాలు ఏమీ వద్దు. ముందుగా నువ్వు చదువుకో అని మనిపడ్డారట.. కానీ కళ్యాణ్ రామ్ ఎంతకు వినకపోయేసరికి ఇద్దరి మధ్య గొడవ వచ్చి కొద్ది రోజులు మాట్లాడుకోలేదట.

ఆ తర్వాత హరికృష్ణ తగ్గి స్వయంగా కళ్యాణ్ రామ్ దగ్గరికి వెళ్లి నేను ఈ సినిమాలో నటిస్తాను. కానీ నువ్వు ముందుగా పై చదువుల కోసం అమెరికా వెళ్ళు. అక్కడ నీ చదువులు కొనసాగిస్తే నేను ఈ సినిమాలో చేస్తానని చెప్పారట. ఇక తండ్రి కోరిక మేరకు కళ్యాణ్ రామ్ యుఎస్ వెళ్లి చదువు పూర్తి చేసి ఆ తర్వాత కొద్ది రోజులు ఉద్యోగం కూడా చేసి ఇండియాకి తిరిగి వచ్చారు. అయితే తండ్రి తో జరిగిన ఆ గొడవ గురించి కళ్యాణ్ రామ్ ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news