కలర్స్ ప్రోగ్రాం ద్వారా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించిన యాంకర్ కం హీరోయిన్ కలర్స్ స్వాతి.ఈమె అసలు పేరు స్వేత్లానా.. రష్యాలో పుట్టి పెరిగిన ఈమె ఆ తర్వాత ఇండియాకి వచ్చేసాక స్వాతిగా పేరు మార్చుకుంది. కలర్స్ ప్రోగ్రాం ద్వారా ఫేమస్ అయిన స్వాతి రెడ్డి కాస్త కలర్స్ స్వాతిగా ఇండస్ట్రీలో పాపులర్ అయింది. అలా మొదటిసారి కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన డేంజర్ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
ఈ సినిమా హిట్ అవ్వడంతో స్వాతికి తెలుగులో మంచి ఆఫర్స్ వచ్చాయి. అలా అష్టా చమ్మా, బంగారు కోడిపెట్ట, స్వామి రారా, కలవరమాయే మదిలో, త్రిపుర, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, సంఘర్షణ, కార్తికేయ వంటి సినిమాల్లో నటించింది. ఇక రీసెంట్ గా మంత్ ఆఫ్ మధు అనే సినిమాలో కూడా నటించింది. అయితే అలాంటి ఈ హీరోయిన్ ని అవి బాగా పెంచి అవకాశాలు సంపాదిస్తున్నావ్ అని హేళనగా చేసి మాట్లాడిన హీరో ఎవరో కాదు మంచు మనోజ్.
అయితే ఈ విషయాన్ని స్వయంగా కలర్స్ స్వాతే చెప్పింది. స్వామి రారా సినిమా ఆడియో ఫంక్షన్ ఈవెంట్ సమయంలో స్వాతిని చూసుకుంటూ మంచు మనోజ్ బుగ్గలు బాగా పెంచి అందంగా తయారయ్యావు.అందుకే అవకాశాలు వస్తున్నాయి అంటూ వెక్కిలిగా నవ్వారట. అంతేకాదు ఈ విషయాన్ని అందరి ముందు మైక్ లో గట్టిగా అనేసరికి ఈ మాటలు విన్న స్వాతి తల్లిదండ్రులు చాలా బాధపడ్డారట.
అంతేకాదు నేను అవకాశాల కోసం ఎవరి దగ్గరికి వెళ్లి చేయిచాచి అడగలేదు. అందుకే నేను అంటే చాలామందికి చిరాకు. నేను కలర్స్ ప్రోగ్రాం ద్వారా ఫేమస్ అయ్యాను. ఒకరి దగ్గరికి వెళ్లి అవకాశం ఇవ్వమని అడగాడం నాకు అస్సలు ఇష్టం లేదు..అంటూ కలర్స్ స్వాతి చెప్పుకొచ్చింది. అయితే ఆరోజు స్వామి రారా ఆడియో ఫంక్షన్ లో మంచు మనోజ్ అన్న మాటలను ఓ ఇంటర్వ్యూలో స్వాతి చెబుతూ చాలా బాధపడింది.