Moviesఎన్టీఆర్ జెట్ స్పీడ్‌…. వ‌రుస‌గా నాలుగు సినిమాలు రిలీజ్‌…!

ఎన్టీఆర్ జెట్ స్పీడ్‌…. వ‌రుస‌గా నాలుగు సినిమాలు రిలీజ్‌…!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత ఒక సినిమా కూడా రాలేదు. ఆ మాటకు వస్తే 2018లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ తర్వాత మళ్లీ నాలుగేళ్లకు త్రిబుల్ ఆర్ సినిమా చేశాడు. త్రిబుల్ ఆర్ సినిమా వచ్చి కూడా మూడేళ్లు అవుతోంది. ఈ విషయంలో తారక్‌ అభిమానులు చాలా నిరాశలో ఉన్నమాట వాస్తవం. ఎన్టీఆర్ నుంచి కనీసం ఏడాదికి ఒక సినిమా వస్తుందని వారు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మరి ఇంత స్లోగా సినిమాలు చేయడం అభిమానులకు అస్సలు నచ్చటం లేదు.

అయితే ఇప్పుడు ఎన్టీఆర్ జెట్ స్పీడ్ తో సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. రాబోయే రెండేళ్లలో ఎన్టీఆర్ నుంచి ఏకంగా ఒకటి రెండు కాదు నాలుగు సినిమాలు రాబోతున్నాయి. ఇది ఎన్టీఆర్ అభిమానులకు మంచి కిక్ ఇచ్చే విషయమే. ఈ ఏడాది దేవర 1 వస్తోంది. ఈ సినిమాని రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. పార్ట్ 2 .. 2025లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రెండు సినిమాలకు కనీసం 8 నెలల గ్యాప్ ఉండబోతోంది. ఇక ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమాకు శుక్రవారం క్లాప్ కొట్టిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా 2026 సంక్రాంతి విడుదల చేస్తామని ప్రకటించారు. వీటి మధ్యలో వార్ 2 సినిమా వస్తుంది. 2025 చివరలో ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్ – ఎన్టీఆర్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న మల్టీస్టారర్ సినిమా ఇది. ఇప్పటికే ఎన్టీఆర్ పై కొన్ని కీలక సన్నివేశాలు కూడా షూట్ చేశారు. అలా 2025 దేవర 2 తో పాటు వార్ 2 సినిమాలతో ఎన్టీఆర్ అభిమానులకు గుర్తుండిపోయే ఏడాది అవ్వబోతుంది.

2025 లో ఎన్టీఆర్ నుంచి రెండు సినిమాలు వస్తున్నాయి. ఈ రెండేళ్ల గ్యాప్ లో మొత్తంగా నాలుగు సినిమాలతో ఎన్టీఆర్ ప్రేక్షకులు ముందుకు రానున్నారు. అలా త్రిబుల్ ఆర్‌ సినిమా తర్వాత వచ్చిన భారీ గ్యాప్‌ను ఎన్టీఆర్ ఈ విధంగా భర్తీ చేస్తే ఎన్టీఆర్ అభిమానులకు.. తెలుగు సినీ ప్రేక్షకులకు అంతకన్నా కావాల్సింది ఏముంటుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news