తెలుగు చలన చిత్ర పరిశ్రమలో హీరోగా, విలన్‌గా, సహాయక నటుడిగా విలక్షణమైన పాత్రలను పోషించి ఓ వెలుగు వెలుగిన రియల్ స్టార్ శ్రీహరి ప్రస్తుతం భౌతికంగా మన మధ్య లేకపోయినా ప్రేక్షకుల గుండెల్లో మాత్రం సజీవంగానే ఉన్నారు. నిరుపేద కుటుంబంలో జన్మించిన ఆయన.. అంచెలంచెలుగా ఎదిగారు. సినిమా రంగంలో తనదైన ముద్ర వేశారు. శ్రీహరి పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. సినీ నటుడు సిఎల్ ఆనందన్ కుమార్తె, ఐటెం డాన్సర్ డిస్కో శాంతిని ఆయన వివాహం చేసుకున్నారు.
1983 నుంచి 1997 వరకు శాంతి గ్లామర్ ఫిల్డ్ లో ఉన్నారు. ఐటెం డాన్సర్ గా ఓ వెలుగు వెలిగారు. సపోర్టింగ్ రోల్స్ తో పాటు పలు కామెడీ రోల్స్ కూడా చేశారు. ఏడు భాషల్లో 900 కంటే ఎక్కువ సినిమాల్లో డిస్కో శాంతి నటించారు. ఇకపోతే డిస్కో శాంతిని శ్రీహరి రెండు సార్లు వివాహం చేసుకున్నారు. 1991లో నాగబాబు హీరోగా తెరకెక్కిన దాదల్ ఎక్స్‌ప్రెస్ మూవీ చిత్రీకరణ సమయంలో శాంతితో శ్రీహరికి పరిచయం ఏర్పడింది.
దాదల్ ఎక్స్‌ప్రెస్ లో శ్రీహరి విలన్ గా చేయగా.. శాంతి స్పెషల్ సాంగ్ లో మెరిశారు. అయితే షూటింగ్ టైమ్‌లో శాంతి మంచితనం, వినయం శ్రీహరిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. దాంతో శ్రీహరి ఒకరోజు నేరుగా వెళ్లి ఆమె ఎదుట పెళ్లి ప్రపోజల్ పెట్టేశారు. మొదట డిస్కో శాంతి ఎటువంటి సమాధానం ఇవ్వకపోయినా.. కొద్ది రోజులకు శ్రీహరి ప్రేమను అంగీకరించింది. ఏడాది పాటు ప్రేమించుకున్న శ్రీహరి, డిస్కో శాంతి.. 1992లో చెన్నైలోని ఒక గుడికి వెళ్లారు.
అక్కడొక పూజారి వారిద్దరి జాతకాలు చూసి ఈ ఏడాది మీరు పెళ్లి చేసుకోకపోతే జీవితంలో ఒకటి కాలేరని చెప్పాడట. సదరు పూజారి మాటలకు బయపడిన శ్రీహరి.. అదే గుడిలో శాంతి మెడలో మూడు ముళ్లు వేసేశారు. అయితే ఈ పెళ్లి గురించి ఎవరికీ చెప్పొద్దని శాంతి శ్రీహరి వద్ద మాట తీసుకుంది. ఎందుకంటే అప్పటికి కుటుంబం మొత్తం శాంతి పైనే ఆధరపడి ఉంది. తన చెల్లిళ్లకు, తమ్ముళ్లకు పెళ్లి చేసి సెటిల్ చేయాలని శాంతి భావించింది. ఇక మూడేళ్లలో శాంతి తనకున్న బాధ్యతలను నెరవెర్చి.. 1996లో అధికారికంగా రెండో సారి శ్రీహరితో ఏడడుగులు వేసింది. పెళ్లి తర్వాత డిస్కో శాంతి ఇండస్ట్రీకి దూరమైంది. శ్రీహరి, శాంతి దంపతులకు ముగ్గురు సంతానం ఒక కుమార్తె.. ఇద్దరు కుమారులు. కుమార్తె అక్షర నాలుగు నెలల వయస్సులోనే అనారోగ్యంతో మరణించింది.