తెలుగు హీరోయిన్ అంజలి.. పేరుకే తెలుగమ్మాయి కానీ పాపులారిటీ మొత్తం తమిళంలోనే.. అయితే మన తెలుగు వాళ్లని తెలుగు ఇండస్ట్రీ ఆదరించదు అనే టాక్ ఉంది.తెలుగు ఇండస్ట్రీలో ఇతర ఇండస్ట్రీ నుండి వచ్చిన హీరోయిన్లకే పెద్ద పీట వేస్తారు. అలా మన తెలుగువారు చాలామంది ఇతర ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాల్సి వస్తుంది. ఇక అలాంటి వారిలో అంజలి ఒకరు.తమిళంలో చాలా పాపులర్ నటిగా పేరు తెచ్చుకుంది.అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ తెలుగులో కూడా ఎన్నో హిట్ సినిమాలు చేసింది. కొన్ని లేడీ ఓరియంటెడ్ మూవీస్ లో కూడా నటించింది.
అయితే అంజలి పేరు చెప్పగానే ఆమె బ్రేకప్ స్టోరీ కూడా అందరికీ గుర్తుకు వస్తుంది. గతంలో అంజలిని ప్రేమ పేరుతో ఓ హీరో మోసం చేశారు. ఇక ఆ హీరో ఎవరో అందరికీ తెలుసు. ఆయనే తమిళ నటుడు జై..
ఇక జై అనే పేరు తెలుగు వారికి తెలియకపోతే జర్నీ సినిమాలో అంజలికి జోడిగా నటించిన హీరో అంటే అందరికీ గుర్తుకొస్తుంది. కోలీవుడ్ హీరో జై అంజలి కాంబినేషన్లో వచ్చిన సినిమా షూటింగ్స్ లో ఏర్పడ్డ పరిచయం కాస్త ప్రేమగా మారి ఇద్దరు సహజీవనం కూడా చేశారు. అలా కొద్ది సంవత్సరాలు వీరిద్దరూ లివింగ్ రిలేషన్ లో ఉన్నాక చివరికి అంజలికి బ్రేకప్ చెప్పి ఆయన తన దారి తాను చూసుకున్నారు.
అయితే అంజలితో రిలేషన్ లో ఉన్న సమయంలో అంజలి తో సినిమాలు చేసే డైరెక్టర్లకు నిర్మాతలకు కూడా ఆయన కండిషన్లు పెట్టేవారు అనే టాక్ ఉంది. ఆమెను ఏదైనా సినిమా కోసం కలవాలంటే ముందుగా జై పర్మిషన్ తీసుకునే వారట. అలాగే అవుట్ డోర్ షూటింగ్ లకి వెళ్లినా కూడా అంజలితో పాటు జై కూడా వచ్చేవారట. ఆయన ఖర్చులు కూడా ఆ సినిమా నిర్మాత భరించేవారట. అంతేకాదు కొన్ని హిట్ సినిమాల్లో సైతం అంజలిని నటించకుండా చేశారట. ఆ కథలు అంజలి దాకా రాకుండానే జై ఆ స్టోరీస్ విని రిజెక్ట్ చేసేవారట.
అలా ఎన్నో హిట్ సినిమాల్లో అంజలి అవకాశాలు కోల్పోయింది. ఇక అంజలి సంపాదించిన డబ్బులు కూడా చాలావరకు జై కి అప్పజెప్పేదట. దాంతో సర్వం మునిగాక అప్పుడు అంజలి జై అనే ప్రేమ మత్తులో నుండి బయటపడింది. చివరికి తన సినీ కెరీర్ కి ఆయనే అడ్డు ఉన్నాడని, తన సినిమా అవకాశాలన్ని పోగొడుతున్నాడని తెలుసుకున్న అంజలి జై కి బ్రేకప్ చెప్పేసింది. అలా పెళ్లి చేసుకుంటారు అనుకున్న ఈ జంట విడిపోయారు. ప్రస్తుతం అంజలి మంచి మంచి సినిమాల్లో నటిస్తోంది.