దక్షిణాది చలన చిత్ర పరిశ్రమలో ఉన్న స్టార్ హీరోయిన్స్ లో కీర్తి సురేష్ ఒకటి. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ మలయాళ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత హీరోయిన్ గా మారింది. తక్కువ సమయంలో తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో స్టార్డమ్ సంపాదించుకుంది. ప్రస్తుతం సౌత్ లోనే కాకుండా నార్త్ లోనూ సినిమాలు చేస్తూ సత్తా చాటోంది. త్వరలోనే రఘుతాత అనే లేడీ ఓరియెంటెడ్ మూవీతో కీర్తి ప్రేక్షకులను పలకరించబోతోంది.
సుమన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కాబోతోంది. ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి సురేష్.. పెళ్లి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. అలాగే తాను సింగిల్ కాదని చెప్పి బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. నిజానికి కీర్తి సురేష్ సింగిలే అని అంతా అనుకున్నారు. గతంలో ఆమె పెళ్లి గురించి పలుమార్లు పలు రకాలుగా వార్తలు వచ్చినప్పటికీ.. అవి చివరకు పుకార్లుగానే మిగిలాయి.
అయితే తాజా ఇంటర్వ్యూలో సింగిల్ గా ఉంటున్నారు.. బోర్ గా అనిపించడం లేదా? అని యాంకర్ ప్రశ్నించింది. అందుకు కీర్తి సురేష్ బదులిస్తూ.. నేను సింగిల్ అని ఎప్పుడూ చెప్పలేదే అంటూ నవ్వేసింది. పరోక్షంగా తాను రిలేషన్ లో ఉన్నట్లు కీర్తి చెప్పకనే చెప్పింది. కానీ ఆ సీక్రెట్ మ్యాన్ ఎవరు అన్నది మాత్రం ఆమె రివీల్ చేయలేదు.
ఇదే ఇంటర్వ్యూలో పెళ్లి ప్రస్తావన రాగా.. నా దృష్టిలో పెళ్లంటే ఇద్దరు వ్యక్తులు ఒకరికొకరు గౌరవం ఇచ్చుకుంటూ జీవించడమే అంటూ కీర్తి సురేష్ కామెంట్స్ చేసింది. ఇక ట్రోల్స్ గురించి కూడా కీర్తి మాట్లాడింది. కెరీర్ ఆరంభం నుంచి తాను ఎన్నో ట్రోల్స్ ఎదుర్కొన్నానని.. దక్షిణాదిలో అత్యధిక ట్రోల్స్ కు గురైంది తానే అవ్వొచ్చని తెలిపింది. విమర్శలను స్వాగతిస్తానని.. కానీ కావాలని నెగటివ్ కామెంట్స్ చేసే వారిని పట్టించుకోనని, అన్నిటికీ కాలమే సమాధానం చెబుతుందని కీర్తి సురేష్ పేర్కొంది.