శోభిత ధూళిపాళ్ల.. ఈ తెనాలి భామ త్వరలో అక్కినేని వారింటికి కోడలు కాబోతున్న సంగతి తెలిసిందే. 2021లో సమంతకు విడాకులు ఇచ్చిన అక్కినేని నాగచైతన్య.. ఆ తర్వాత శోభితతో లవ్ లో పడ్డాడు. దాదాపు రెండేళ్ల నుంచి సీక్రెట్ రిలేషన్ లో ఉన్న ఈ జంట.. ఆగస్టు 8న నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ వేడుక నాగార్జున నివాసంలో జరిగింది. చై-శోభిత ఎంగేజ్మెంట్ ఫోటోలను నాగార్జున స్వయంగా పంచుకున్నారు.
మూడుముళ్ళ బంధంతో ఒకటి కాబోతున్న కొత్త జంటకు బెస్ట్ విషెస్ తెలిపారు. ఇక అప్పటి నుంచి శోభిత గురించి అక్కినేని ఫ్యాన్స్ మరియు నెటిజన్స్ తెగ ఉత్సాహం చూపుతున్నారు. ఈ క్రమంలోనే శోభిత ధూళిపాళ్ల పాస్ట్ లవ్ స్టోరీ గురించి ఓ న్యూస్ ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతోంది. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన శోభిత.. ఆ తర్వాత హీరోయిన్ గా మారింది. తెలుగు అమ్మాయి అయినప్పటికీ.. బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ అక్కడ గుర్తింపు సంపాదించుకుంది.
పలు హాలీవుడ్ మూవీస్ లోనూ యాక్ట్ చేసిన శోభిత.. మోడల్ గా ఉన్న రోజుల్లో ప్రణవ్ మిశ్రా అనే వ్యక్తితో ప్రేమలో పడింది. ఇతను ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మరియు లగ్జరీ బ్రాండ్ హ్యూమన్ కో-ఫౌండర్. ఓ ఫ్యాషన్లో షోలో ప్రణవ్ మిశ్రాతో శోభితకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో ఇద్దరూ రిలేషన్ లో ఉన్నారు. ఆ తర్వాత మనస్పర్థలు తలెత్తడంతో ప్రణవ్ మిశ్రాకు శోభిత బ్రేకప్ చెప్పిందని గతంలో బాలీవుడ్ మీడియా కూడో కూసింది.