అదేమిటో గానీ అక్కినేని కుటుంబానికి తొలి పెళ్లి అచ్చి రావట్లేదు. నాగార్జునకి రెండో పెళ్లి – సుమంత్ పెళ్లి కూడా ఏడాదికే పెటాకులు అయింది. సుమంత్ చెల్లి యార్లగడ్డ సుప్రియకు కూడా పెళ్లి కలిసి రాలేదు. ఇప్పుడు నాగ చైతన్య విషయంలోనూ అదే జరిగింది. అఖిల్‌కు తొలి పెళ్లి అనలేము కానీ ఎంగేజ్మెంట్ జరిగి మరీ క్యాన్సిల్ అయింది. ఇక ఎంతో సాఫ్ట్ గా ఉండే నాగచైతన్య స్టార్ హీరోయిన్ సమంత ప్రేమించి ఇంట్లో పోరాడి వాళ్ళని ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నాడు.. నాలుగేళ్లకే ఆ పెళ్లి పెటాకులు అయ్యింది. కట్ చేస్తే ఇప్పుడు మరో హీరోయిన్ శోభితతో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. రేపో మాపో అక్కినేని ఇంట్లో మళ్ళీ పెళ్లి బాజాలు మోగుతాయి.. మరి సమంత మాటేమిటి ? సమంత కూడా మరో పెళ్లి చేసుకుంటుందా ? అంటే చైతు రెండో పెళ్లిపై సమంత ఎలా రియాక్ట్ ? అవుతుందన్నది కూడా ఇప్పుడు ఆసక్తిగా మారింద.
ఇక సమంత ఏనాడు తన ఎమోషన్‌ను అదుపులో పెట్టుకోవాలని చూడలేదు. అవకాశం వచ్చినప్పుడల్లా తన ఫీలింగ్స్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటూనే వస్తోంది. సమంత ఒక పోస్ట్ పెడితే అది ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా నాగ చైతన్యను గుర్తు చేసేలా ఉంటుందని సోషల్ మీడియాలో ఎప్పుడు రచ్చ జరుగుతూ ఉంటుంది. అయితే ఈసారి సమంత ఎలా ? స్పందిస్తుందన్నది ఆసక్తికరం.
చై – సమంత విడిపోయిన తర్వాత కనీసం సినిమా వేడుకల్లో కూడా ఎదురు పడలేదు. ఒకరి గురించి ఒకరు డైరెక్ట్ గా ఇప్పుడు మాట్లాడిన దాఖలాలు లేవు.. ఎవరి జీవితం వాళ్ళదే ఎవరి సినిమాలు వారివే అన్నట్టుగా ఎవరి దారుల్లో వారు ప్రయాణిస్తున్నారు. ఇక చైతో విడిపోయిన తర్వాత సమంత మానసికంగా చాలా స్ట్రాంగ్ గా మారిందట. చైతన్య ఎప్పటికైనా మరొకరిని పెళ్లి చేసుకుంటాడని ముందే ఊహించిన ఆమె తాజాగా చైతు శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్మెంట్ విషయంలో కూడా చాలా కూల్ గా ఉంటుందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.