సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా సినీ పరిశ్రమకు పరిచయమైన ప్రిన్స్ మహేష్ బాబు.. చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోగా మారాడు. భారీ బ్యాక్‌గ్రౌండ్ కు తోడు తనదైన గ్లామర్ మరియు యాక్టింగ్ స్కిల్స్ తో హీరోగా నిలదొక్కుకున్నాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. నేషనల్ వైడ్ గా అభిమానులను సంపాదించుకున్నాడు. తండ్రికి తగ్గ తనయుడినని నిరూపించు
ప్రస్తుతం మహేష్ బాబు నటుడిగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా సత్తా చాటుతున్నాడు. అలాగే అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ సమాజ సేవకుడిగా సైతం పేరు తెచ్చుకున్న మహేష్ బాబు పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించి ఎన్నో ఆసక్తికర విషయాలు తెరపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తన ఫిల్మ్ కెరీర్ లో మహేష్ బాబు ఇష్టపడే టాప్-5 చిత్రాల జాబితా నెట్టింట వైరల్ అవుతోంది.
అందులో మొదట చెప్పుకోవాల్సిన చిత్రం మురారి. కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన ఈ ఫ్యామిలీ డ్రామా మహేష్ బాబుకు ఫస్ట్ బ్లాక్ బస్టర్ ను అందించింది. అలాగే తనను స్టార్ గా మార్చిన ఒక్కడు సినిమా అన్నా మహేష్ బాబుకు చాలా ఇష్టం. గుణశేఖర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం 2006లో విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.
పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన పోకిరి మహేష్ బాబుకు ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ. పోకిరితోనే మహేష్ బాబు మాస్ ప్రేక్షకులకు చేరువ అయ్యాడు. ఈ చిత్రం అతని స్టార్డమ్ ను పెంచింది. మరియు మహేష్ కెరీర్ లో ఫస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
ఇక వీటితో పాటు తన ఫిల్మ్ కెరీర్ లో దూకుడు మరియు శ్రీమంతుడు చిత్రాలను సైతం మహేష్ బాబు బాగా లైక్ చేస్తాడట. శ్రీను వైట్ల తీసిన దూకుడు చిత్రం కెరీర్ పరంగా మహేష్ బాబుకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తే.. కొరటాల శివ డైరెక్ట్ చేసిన శ్రీమంతుడు ఒక నటుడిగానే కాకుండా వ్యక్తిగతంగానూ ఆయనకు ఎంతో సంతృప్తిని ఇచ్చింది.