యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య రెండో పెళ్లికి సిద్ధమైన సంగతి తెలిసిందే. సమంతతో విడిపోయిన తర్వాత నాగచైతన్య ప్రముఖ హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో ప్రేమలో పడ్డాడు. రెండేళ్ల నుంచి రిలేషన్ లో ఉన్న ఈ జంట ఇప్పుడు మూడు ముళ్ల బంధంతో ఒకటి కాబోతోంది. ఈరోజు ఉదయం నాగార్జున నివాసంలో నాగ చైతన్య, శోభిత నిశ్చితార్థం వేడుక వైభవంగా జరిగింది.
కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ జంట ఉంగరాలు మార్చుకున్నారు. కుమారుడి ఎంగేజ్మెంట్ ఫోటోలను నాగార్జున స్వయంగా సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఇదే తరుణంలో కాబోయే కోడలిపై గతంలో నాగార్జున చేసిన కొన్ని షాకింగ్ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. బాలీవుడ్ లో కెరీర్ స్టార్ట్ చేసిన శోభిత.. అడవి శేష్ హీరోగా నటించిన గూఢచారి మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది.
2018లో విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని నమోదు చేసింది. అయితే గూఢచారి సక్సెస్ మీట్ కు స్పెషల్ గెస్ట్ గా పాల్గొన్న నాగార్జున.. స్టేజ్ పై మాట్లాడుతూ శోభిత గురించి బోల్డ్ కామెంట్స్ చేశారు. శోభిత సో గుడ్.. నేను ఇలా చెప్పకూడదు కానీ మూవీలో శోభిత చాలా హాట్ గా ఉంది. ఆమెలో ఏదో తెలియని ఎట్రాక్షన్ ఉంది అంటూ నాగార్జున అప్పట్లో కామెంట్స్ చేశారు.
నాగ చైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ చేసుకున్న నేపథ్యంలో.. ఆ పాత పాత వీడియోను ప్రస్తతం ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. నాగార్జున వ్యాఖ్యలపై నెటిజన్ల రకరకాలుగా స్పందిస్తున్నారు. కాగా, అప్పటికి శోభితతో నాగ చైతన్య రిలేషన్ స్టార్ట్ అవ్వలేదు. సమంతతో చైతు కలిసే ఉన్నాడు. నాలుగేళ్లు సాగిన వీరి బంధం 2021లో విడాకులతో ముగిసింది.