టాలీవుడ్ లో ఈరోజు ఓ సెన్సేషనల్ మ్యాటర్ బయటకు వచ్చింది. అక్కినేని వంశ వారసుడు అక్కినేని నాగచైతన్య – హీరోయిన్ శోభిత దూళిపాళ్ల ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ విషయాన్ని నాగార్జున అధికారికంగా ప్రకటించారు. సమంతతో విడాకులు తర్వాత చైతు.. శోభిత దూళిపాళ్లతో ప్రేమలో ఉన్నట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వీరిద్దరూ కలిసి విదేశీ పర్యటనలో కూడా చాలాసార్లు కనిపించారు. వీరిద్దరూ కలిసి చాలాసార్లు కనిపించడంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని.. సోషల్ మీడియా చాలాసార్లు స్పష్టం చేసింది. అయితే ఎట్టకేలకు ఈరోజు హైదరాబాద్లో చైతు – శోభిత కుటుంబాలకు చెందిన పెద్దలు ఆత్మీయ సమావేశం నిర్వహించినట్టు తెలుస్తోం
ఈ సమావేశంలోనే ఎంగేజ్మెంట్ కూడా చేసేశారు. ఇక వీరిద్దరి పెళ్లి ఎప్పుడు ? ఉంటుంది అన్నదానిపై త్వరలోనే క్లారిటీ రానుంది. ఇదిలా ఉంటే చైతు – శోభిత ఎంగేజ్మెంట్ వార్తలు బయటకు రావడంతో చైతు మాజీ భార్య స్టార్ హీరోయిన్ సమంత ఇన్‌స్టా వేదికగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. ఆ పోస్టులో ఆమె కష్టాలను.. ప్రతికూల పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కొన్న వాళ్ళు ఎప్పుడూ కూడా ఒంటరివాళ్లు కాదనే విషయాన్ని గుర్తించుకోవాలని చెప్పారు.
అలాగే జీవితంలో ప్రతి ఒక్కరికి ఎదురయ్యే సవాళ్లను వాళ్ళ పైనుంచి ఓ శక్తి కాపాడుతూ ఉంటుంది.. ఎల్లప్పుడూ ఆ శక్తి వారి చుట్టూ రక్షణగా ఉంటుంది.. అలాంటి టైంలో నీ మానసిక ధైర్యం చాలా గొప్పది.. నీకు ఎప్పుడు మేమంతా అండగా ఉంటాం అని వినేష్ పోగట్ గురించి సమంత ఓ పోస్టు రాసుకు వచ్చింది. అయితే సమంత పెట్టిన పోస్టులో వినేష్‌తో పాటు తన జీవితాన్ని గురించి కూడా పరోక్షంగా ప్రస్తావించినట్టు ఉందని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. తన మాజీ భర్త చైతు – శోభిత ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నారని బాధతో సమంత ఇలా తన ఆవేదన వెళ్లగెక్కిందని సోషల్ మీడియాలో చర్చలు వినిపిస్తున్నాయి.