Moviesప్రభుదేవా భార్య అవ్వాల్సిన నయనతార… వాళ్ల కార‌ణంగానే బ్రేక‌ప్‌..?

ప్రభుదేవా భార్య అవ్వాల్సిన నయనతార… వాళ్ల కార‌ణంగానే బ్రేక‌ప్‌..?

ప్రభుదేవా డాన్స్ కొరియోగ్రాఫర్ గా.. నటుడిగా.. దర్శకుడిగా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. ఇలా ఇండస్ట్రీలో విభిన్న పాత్రలు పోషించిన ప్రభుదేవా నయనతార వ్యవహారం అప్పట్లో ఎంత పెద్ద సెన్సేషనో చెప్పనక్కర్లేదు. ఇప్పటికి కూడా నయనతార వల్ల నష్టపోయిన ప్రభుదేవా మొదటి భార్య ఆమెకు శాపనార్థాలు పెడుతూనే ఉంటుంది. నయనతార విఘ్నేష్ ని పెళ్లి చేసుకునే సమయంలో కూడా ఆమె పై శాపనార్థాలు పెట్టింది రమాలత్. అయితే ఎంతో గాఢంగా ప్రేమించుకున్న నయనతార ప్రభుదేవాలు ఎందుకు పెళ్లి చేసుకోలేకపోయారు.. దానికి కారణాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం..

ప్రభుదేవా,నయనతారల మధ్య చిగురించిన ప్రేమ పెళ్లి వరకు వెళ్ళింది. వీరిద్దరూ కలిసి ఎన్నో సినిమా ఈవెంట్లకు పబ్లిక్ గా తిరిగేవారు. అంతేకాదు పెళ్లి చేసుకోకుండానే సహజీవనం కూడా చేశారు. ఇక నయనతారతో ప్రేమలో పడి ప్రభుదేవా తాను మొదట ప్రేమించి పెళ్లి చేసుకున్న రమాలత్ కి కూడా దూరంగా ఉండి ఆమెకు విడాకులు ఇచ్చేశారు. కానీ అనూహ్యంగా ప్రభుదేవా నయనతారల మధ్య కూడా బ్రేకప్ జరిగింది. ఇక వీరి బ్రేకప్ కి కారణం ఇండస్ట్రీలో రకరకాల వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇక అందులో ఒక మాట మాత్రం కోలీవుడ్లో బలంగా వినిపించింది.

అదేంటంటే ఆ పిల్లల కారణంగానే ప్రభుదేవా, నయనతారల బంధం బ్రేక్ అయిందట. ఇక అసలు విషయం ఏమిటంటే..ప్రభుదేవా మొదటి భార్యకి ముగ్గురు పిల్లలు ఉన్నారు.అందులో మొదటి అబ్బాయి క్యాన్సర్ కారణంగా మరణించారు. అయితే రమాలత్ కు విడాకులు ఇచ్చి నయనతారను పెళ్లి చేసుకోవాలనుకున్న సమయంలో తన ఇద్దరు పిల్లలు కూడా తమతోనే ఉంటారు అని నయనతారకు ప్రభుదేవా చెప్పారట. కానీ నయనతార మాత్రం దానికి ఒప్పుకోలేదట.

అయితే ఎన్నిసార్లు నచ్చజెప్పాలని చూసినా కూడా నయనతార పిల్లలు తమతో ఉండడానికి అంగీకరించకపోయేసరికి ఈ విషయంలో పెళ్లయ్యాక కూడా ఇద్దరి మధ్య గొడవలు వస్తాయని ప్రభుదేవా అనుకున్నారో ఏమో తెలియదు కానీ నయనతారకు బ్రేకప్ చెప్పారు అంటూ అప్పట్లో ఓ రూమర్ గట్టిగా వినిపించింది. అలా ప్రభుదేవా తన పిల్లల కోసం నయనతారకు బ్రేకప్ చెప్పినట్టు కోలీవుడ్ ఇన్సైడ్ వర్గాల టాక్.ఇక నయనతారకు బ్రేకప్ చెప్పాక ప్రభుదేవా హిమానీ సింగ్ అనే ఓ ఫిజియో థెరపిస్టుని పెళ్లి చేసుకున్నారు. వీరికి గత ఏడాది ఓ పాప కూడా పుట్టింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news