దివంగత నటుడు శరత్ బాబు నిన్నటి తరం వారికే కాదు నేటి తరం సినీ ప్రియులకు కూడా అత్యంత సుప్రసిద్ధుడు. ఐదు దశాబ్దాల సినీ ప్రస్థానంలో శరత్ బాబు తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో 250కి పైగా చిత్రాల్లో నటించాడు. హీరోగానే కాకుండా విలన్‌గా, సహాయక నటుడిగా విలక్షణ పాత్రలు పోషించారు. శరత్ బాబు వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. సినిమాలలో నిలదొక్కుకోవటానికి ప్రయత్నిస్తున్న రోజుల్లో అప్పటికే తెలుగు సినీ రంగంలో స్టార్ అయిన రమాప్రభను ప్రేమించి పెళ్ళిచేసుకున్న
వయసులో రమాప్రభ కంటే శరత్ బాబు నాలుగేళ్లు చిన్నవారు. 14 సంవత్సరాల పాటు అన్యోన్యంగా జీవించిన ఈ జంట.. ఆ తర్వాత విడాకులతో తమ బంధాన్ని ముగించారు. అయితే శరత్ బాబు భార్య ఎవరంటే అందరికీ రమాప్రభనే గుర్తుకు వస్తుంది. కానీ ఆయనకు అలనాటి నటి జయలలిత కూడా భార్యే అట. హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన జయలలిత.. తర్వాతి కాలంలో సైడ్ రోల్స్ చేశారు. వ్యాంప్ పాత్రలతో ఆమె ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం పలు సీరియల్స్ లో ఆమె నటిస్తున్నారు.
అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జయలలిత.. శరత్ బాబుతో తనకున్న రిలేషన్ గురించి చెబుతూ కొన్ని సంచలన నిజాలను వెలుగులోకి తీసుకొచ్చారు. ఆమె మాట్లాడుతూ.. శరత్ బాబుగారితో నాకు పెళ్లి అయింది. ఆయనతో ఎనిమిదేళ్లు కలిసి ఉన్నాను. నన్ను లలిత లలిత అని పిలుస్తుండేవారు. మేమిద్దరం జంటగా చాలా యాత్రలకు వెళ్లాము. సినిమాల ద్వారా ఆయన చాలా సంపాదించినా నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. నేనూ తీసుకోలేదు.
శరత్ బాబు చాలా అందంగా ఉండేవారు. ఆయనతో ఒక బిడ్డను కనాలనుకున్నారు. అందుకు మొదట ఆయన సుముఖతను వ్యక్తం చేసినప్పటికీ.. ఆ తరువాత వెనుకంజ వేశారు. నా జీవితానికి ఇల్లు, పెళ్లి, పిల్లలు రాసిపెట్టి లేవు అంటూ జయలిలత చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.