అక్కినేని వారింట పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య మరోసారి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టేందుకు సిద్ధం అవుతున్నాడు. గతంలో నాగచైతన్య ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 2017లో గోవా వేదికగా వీరి వివాహం అత్యంత గ్రాండ్ గా జరిగింది. అయితే పెళ్లై నాలుగేళ్లు తిరక్క ముందే వ్యక్తిగత విభేదాలతో నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకున్నారు.
ఆ తర్వాత నాగచైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో ప్రేమలో పడ్డట్టు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ వార్తలే నిజం కాబోతున్నాయి. త్వరలోనే నాగచైతన్య శోభితతో ఏడడుగులు వేయబోతున్నాడట. నేడు(ఆగస్టు 8) నాగచైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ జరగబోతుందని జోరుగా వార్తలు ప్రచారం జరుగుతోంది. నాగార్జున నివాసంలో అతికొద్ది మంది బంధువుల సమక్షంలో ఈ వేడుక జరగబోతోంది.
నాగచైతన్య-శోభిత నిశ్చితార్థానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ సినీ వర్గాల్లో న్యూస్ స్ప్రెడ్ అవుతోంది. ఇక ఈ రోజు సాయంత్రం చైతు-శోభిత ఎంగేజ్మెంట్ ను నాగార్జున అధికారికంగా ప్రకటించనున్నారని కూడా అంటున్నారు. నాగచైతన్య-శోభిత ఎంగేజ్మెంట్ న్యూస్ ఎంత వరకు నిజమో తెలియాలంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.
కాగా, నాగచైతన్య, శోభిత ఇంత వరకు కలిసి స్క్రీన్ షేర్ చేసుకోలేదు. కానీ ముంబైలోని ఓ ఈవెంట్ లో వీరిద్దరూ ఫస్ట్ టైమ్ మీట్ అయ్యారట. అలా ఏర్పడిన పరిచయం క్రమంగా ప్రేమకు దారి తీసింది. గత కొంత కాలం నుంచి చైతు, శోభిత తమ రిలేషన్ గురించి హింట్స్ ఇస్తూనే వచ్చారు. ఇద్దరూ జంటగా పలుమార్లు వెకేషన్స్ కు వెళ్లారు. అందుకు సంబంధించిన పిక్స్ కూడా బయటికి వచ్చాయి.