Moviesఎన్టీఆర్ పాడిన పాట‌లు ఇవే .. అన్నీ సూప‌ర్ హిట్లే..!

ఎన్టీఆర్ పాడిన పాట‌లు ఇవే .. అన్నీ సూప‌ర్ హిట్లే..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సూపర్ డూపర్ హిట్ సినిమాలతో దూసుకుపోతున్నారు. కెరీర్ లోనే తిరుగులేని ఫామ్ లో ఉన్న ఎన్టీఆర్ మల్టీ టాలెంటెడ్. హీరో ఎన్టీఆర్ పేరు చెబితే ముందుగా గుర్తుకు వచ్చేది డైలాగ్ డెలివరీ .. అద్భుతమైన డైలాగ్ డెలివరీతో పాటు యాక్టింగ్, డ్యాన్స్ కుమ్మేస్తాడు. ఎన్టీఆర్ కేవలం డ్యాన్స్ … యాక్టింగ్ మాత్రమే కాదు సింగర్ గా కూడా మెప్పించారు. కొన్ని సినిమాలలో ఎన్టీఆర్ పాడిన పాటలు ఏంటో తెలుసుకుందాం. నాన్నకు ప్రేమతో సినిమాలో ఎన్టీఆర్ ఐ వాన‌ ఫాలో ఫాలో సాంగ్ ఆలపించారు. ఈ పాట సూపర్ డూపర్ హిట్ అయింది. దేవిశ్రీప్రసాద్ ఈ పాటకి మ్యూజిక్ అందించారు.

అలాగే రభస సినిమాలో రాకాసి రాకాసి న‌ను ర‌బ్బ‌రు బంతిలా ఎగ‌రేసి అనే పాటతో మరోసారి సింగర్ గా అదరగొట్టారు. ఈపాటికి తమన్‌ సంగీతం అందించారు. అలాగే అదుర్స్ సినిమాలో వేర్ ఇస్ ది పంచికట్టు అనే పాటకు మరోసారి ఎన్టీఆర్ తన గాత్రం అందించారు. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించారు. మణిశర్మ మ్యూజిక్ అందించిన కంత్రి సినిమాలో వన్ టూ త్రీ నేనొక కంత్రి అనే పాటతో అలరించారు. ఈ పాట సూపర్ డూపర్ హిట్ అయినా ఈ సినిమా డిజాస్టర్ అయింది.

ఇక రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ సినిమా యమదొంగలో ఓ లమ్మి తిక్క‌ రేగిందా సాంగ్ కూడా ఎన్టీఆర్ ఆలపించారు. తెలుగులోనే కాదు కన్నడలోనూ ఎన్టీఆర్ ఒక పాట పాడారు. పునీత్ రాజ్ కుమార్ హీరోగా చేసిన చక్ర వ్యూహ సినిమాలో గెలయా గెలియా అనే సాంగ్ పాడారు. ఈ సాంగ్‌కు థ‌మ‌న్ సంగీతం అందించారు. అలా ఎన్టీఆర్ పాటలు పాడిన ఈ సాంగ్స్ అన్ని సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో దేవ‌ర పాన్ ఇండియా సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news