అందాల ఆరబోతతో సంబంధం లేకుండా అభినయంతో స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న అతికొద్ది మంది హీరోయిన్లలో నిత్యా మీనన్ ఒకటి. అలా మొదలైంది మూవీతో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన నిత్యామీనన్.. ఆ తర్వాత తెలుగు తో పాటు తమిళ్, మలయాళ భాషల్లో సైతం తనదైన ముద్ర వేసింది. నటిగానే కాకుండా నేపథ్య గాయనిగా సైతం ప్రేక్షకుల హృదయాలు దోచుకుంది. కెరీర్ పరంగా సూపర్ సక్సెస్ అయిన నిత్యా మీనన్.. పర్సనల్ లైఫ్ లో మాత్రం వెనకబడింది.
34 ఏళ్లు వచ్చిన ఈ ముద్దుగుమ్మ పెళ్లి చేసుకోకుండా ఇంకా సింగిల్ లైఫ్ నే లీడ్ చేస్తోంది. అయితే గతంలో పలువురు హీరోలతో నిత్యామీనన్ ప్రేమాయణం నడిపినట్లు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా ఒక స్టార్ హీరో నిత్యా మీనన్ తో ప్రేమలో పడి తన భార్యకు సైతం విడాకులు ఇవ్వడానికి సిద్ధమయ్యాడని బలంగా ప్రచారం జరిగింది. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్.
ఆన్ స్క్రీన్ పై దుల్కర్ సల్మాన్, నిత్యా మీనన్ లది సూపర్ హిట్ జోడి. వీరిద్దరూ జంటగా బెంగళూర్ డేస్, ఓకే కన్మని, 100 డేస్ ఆఫ్ లవ్, ఉస్తాద్ హోటల్ వంటి చిత్రాల్లో నటించారు. తెర మీద దుల్కర్, నిత్యా కెమిస్ట్రీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే వరుస సినిమాలు చేస్తున్న క్రమంలో నిత్యా మీనన్, దుల్కర్ సల్మాన్ ఒకరితో ఒకరు ప్రేమలో పడ్డారని గతంలో పెద్ద ఎత్తున్న వార్తలు వచ్చాయి. అప్పటికే దుల్కర్ చెన్నైకు చెందిన ఆర్కిటెక్ట్ అమల్ సూఫియాతో వివాహం జరిగింది.
దాంతో నిత్యా మీనన్ కోసం దుల్కర్ తన భార్యను దూరం పెడుతూ వచ్చాడు. సూఫియాకు విడాకులు కూడా ఇవ్వాలని భావించాడట. అయితే ఇంతలోనే ఈ విషయం కాస్త మమ్ముట్టికి తెలిసింది. వెంటనే ఆయన కలగజేసుకుని దుల్కర్ ను వదిలేయమని నిత్యా మీనన్ కు స్ట్రోంగ్ వార్నింగ్ ఇచ్చారట. అలాగే ఇటు కొడుకు దుల్కర్ కు సైతం బ్రెయిన్ వాష్ చేశారట. ఇక అప్పుడు దుల్కర్, నిత్యా మీనన్ తమ రిలేషన్ ను కట్ చేసుకుని ఫ్రెండ్స్ గా మారిపోయారని మలయాళ ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొట్టాయి.