Moviesఆ లేడీ యాంకర్‌తో నవీన్ చంద్రకి ఉన్న రిలేషన్.. పెళ్లికి ముందే...

ఆ లేడీ యాంకర్‌తో నవీన్ చంద్రకి ఉన్న రిలేషన్.. పెళ్లికి ముందే అలా..?

హీరో నవీన్ చంద్ర.. సినిమాల మీద ఉన్న ఇంట్రెస్ట్ తో చిన్నప్పటి నుండి సినిమాలు డాన్స్, స్కిట్స్ వేస్తూ ఉండేవారట. ఇక నవీన్ చంద్రకి సినిమాల మీద ఉన్న ఇంట్రెస్ట్ చూసి పేరెంట్స్ కూడా సపోర్ట్ చేశారట. అలా టాలీవుడ్లోకి ఈయన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా చేసిన అందాల రాక్షసి సినిమాలో హీరోగా చేశారు. ఇక ఈయనతో పాటు రాహుల్ రవీంద్రన్ కూడా హీరోగా చేశారు. ఈ సినిమా హిట్టడంతో నవీన్ చంద్ర కి మంచి గుర్తింపు లభించింది.ఆ తర్వాత నవీన్ చంద్ర హీరోగా ఎన్నో సినిమాలు చేశారు కానీ టాలీవుడ్ లో కనీసం టైర్-2 హీరోలలో ఒకరిగా కూడా కొనసాగలేక పోయారు. దానికి కారణం ఈయన ఎంచుకున్న సినిమాలని చెప్పుకోవచ్చు.ఈయన చేసిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవ్వడంతో నవీన్ చంద్రకి హీరో గుర్తింపు రాలేదు.

ఈయన మీలో ఎవరు కోటీశ్వరుడు, లచ్చిందేవికి ఓ లక్కుంది, త్రిపుర వంటి సినిమాల్లో హీరోగా నటించారు. అలాగే అరవింద సమేత,నేను లోకల్, రంగ రంగ వైభవంగా వంటి సినిమాలలో విలన్ పాత్రలో నటించారు. అయితే అలాంటి నవీన్ చంద్ర హీరోగా కంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే ప్రస్తుతం రాణిస్తున్నారు. ఇక రీసెంట్ గా ఈయన కాజల్ అగర్వాల్ నటించిన సత్యభామ వెబ్ సిరీస్లో కాజల్ భర్తగా కూడా చేశారు. అయితే నవీన్ చంద్ర కి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే ఆ యాంకర్ కి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి.. నవీన్ చంద్ర ఇండస్ట్రీలోకి రావడానికి ఆమె ఎలా సహకరించింది అనేది ఇప్పుడు చూద్దాం.

నవీన్ చంద్ర కి యాంకర్ ఉదయభానుతో మంచి అనుబంధం ఉండేదట. అయితే వీరిద్దరి మధ్య అనుబంధం అంటే వేరే ఏదో కాదు.. నవీన్ చంద్ర సినిమాల్లోకి రావడానికి ఒక రకంగా ఉదయభాను కారణమైందట. ఎలా అంటే.. అప్పట్లో ఉదయభాను యాంకర్ గా చేసిన సమయంలో అన్నపూర్ణ స్టూడియోకి నవీన్ చంద్ర ఓ డాన్స్ షో కోసం వచ్చారట. ఆ టైంలోనే ఉదయభానుని కలిశారట. సినిమాలపై ఉన్న ఇంట్రెస్ట్ గురించి చెప్పారట.ఆ టైంలో ఉదయభాను సినిమాల్లోకి రావడానికి, సినిమాల్లో ఉన్న పరిస్థితుల గురించి వివరించి నవీన్ చంద్రలో ధైర్యం నింపిందట.ఇక ఆమె ఇచ్చిన ధైర్యంతోనే నవీన్ చంద్ర ఇప్పటివరకు ఇండస్ట్రీలో నీలదొక్కుకో గలుగుతున్నారట.

ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఇండస్ట్రీలో ఉండడానికి కారణం ఉదయభానునేనని, ఆమె ఇచ్చిన ఇన్స్పిరేషన్ తోనే ఎలాంటి పరిస్థితులను అయినా తట్టుకోగలుగుతున్నాను అంటూ నవీన్ చంద్ర ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక ప్రస్తుతం ఉదయభాను నవీన్ కి టచ్ లో లేదట. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఆ యాంకర్ ని ఫాలో అవుతున్నానని నవీన్ చంద్ర తెలిపారు. అలా ఒకరకంగా నవీన్ చంద్ర సినిమాల్లో రాణిస్తున్నారంటే దానికి ఉదయభాను పరోక్ష కారణం అని చెప్పుకోవచ్చు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news