ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువ సంచలన సృష్టిస్తున్న పేరు ఎవరిదయ్యా అంటే.. కేవలం రాజ్ తరుణ్ మాత్రమే..ఒకప్పుడు వరుస సినిమాలతో జోరు మీదున్న రాజ్ తరుణ్ ఆ తర్వాత వరుసగా ఫ్లాప్ సినిమాలను మూట కట్టుకోవడంతో తన సినీ కెరీర్ అక్కడితో ఆగిపోయింది అని అందరూ అనుకున్నారు. అయితే చాలా రోజులుగా ఆయనకు ఒక్క హిట్టు కూడా పడలేదు.దాంతో పూర్తిగా సినిమాల పైనే ఫోకస్ పెట్టారు.ఇక ఈ మధ్యనే పురుషోత్తముడు, తిరగబడరా సామి వంటి రెండు సినిమాలను రోజుల వ్యవధిలోనే విడుదల చేశారు. కానీ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచాయి. ఇక సినిమాల పరంగా కంటే ఆయన వ్యక్తిగతంగా మీడియాలో హైలైట్ అవుతున్నారు.
ప్రస్తుతం ఈయన పేరు సోషల్ మీడియాలో సెంటర్ ఆఫ్ ది పాయింట్ అయిపోయింది. అయితే అలాంటి రాజ్ తరుణ్ చాలా రోజులు సహజీవనం చేసిన లావణ్య ఆయనపై ఆరోపణలు చేస్తూ ఆయన తనకి కావాలి అని రచ్చ రచ్చ చేస్తుంది. ఇందులో భాగంగా రాజ్ తరుణ్ కు సంబంధించిన ఎన్నో ఎఫైర్లు బయట పెట్టింది. అలా రిద్ధి కుమార్, అరియానా,మాల్వి మల్హోత్రా,శాలిని పాండే, హెబ్బా పటేల్ ఇలా ఎంతో మంది హీరోయిన్ల పేరు తెరమీదకి తీసుకు వచ్చింది. ఇక వీళ్ళే కాదు అప్పట్లో రాజ్ తరుణ్ కి ఒక పెళ్లయిన యాంకర్ తో కూడా రిలేషన్ ఉంది అనే వార్తలు మీడియాలో చాలా వైరల్ అయ్యాయి.
ఇక ఆ పెళ్లైన యాంకర్ ఎవరో కాదు లాస్య మంజునాథ్.. మా మ్యూజిక్ లో వచ్చే సంథింగ్ సంథింగ్ అనే షో ద్వారా రవి,లాస్య లు చాలా ఫేమస్ అయిపోయారు. ఈ ఒక్క షో వీరి కెరీర్ ని మలుపు తిప్పింది.ఆ తర్వాత రవి, లాస్య కలిసి చాలా షోలు చేశారు. అయితే ఆ షో లు చేసిన సమయంలో వీరి మధ్య ప్రేమ ఉందనే వార్తలు వినిపించాయి. కానీ అప్పటికే లాస్య మంజునాథ్ అనే వ్యక్తితో పీకల్లోతు ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది.ప్రస్తుతం వీరికి పిల్లలు కూడా ఉన్నారు. అయితే అలాంటి లాస్య రాజ్ తరుణ్ తో డేటింగ్ చేసిందనే వార్తలు అప్పట్లో మీడియాలో గుప్పమన్నాయి.
అయితే ఈ వార్తలపై అటు లాస్య గానీ ఇటు రాజ్ తరుణ్ గానీ స్పందించలేదు. కానీ రీసెంట్ గా లాస్య తో ఉన్న ఎఫైర్ గురించి రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. అసలు ఆ యాంకర్ ఎవరో కూడా నాకు తెలియదు.. ఆమెను ఇప్పటివరకు నేను కలవలేదు కూడా.. కానీ కొంతమంది కావాలనే నేను వేరే వాళ్ళతో దిగిన ఫోటోను మార్ఫింగ్ చేసి ఆ అమ్మాయి ఫోటో పెట్టి మా ఇద్దరి మధ్య రిలేషన్ ఉందని,డేటింగ్ చేస్తున్నామని వార్తలు అంటగట్టారు. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదు అంటూ రాజ్ తరుణ్ క్లారిటీ ఇచ్చేశారు.