Moviesఏంటి.. హీరో న‌వీన్ పోలిశెట్టికి పెళ్లైపోయిందా..?

ఏంటి.. హీరో న‌వీన్ పోలిశెట్టికి పెళ్లైపోయిందా..?

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్ట‌ర్ న‌వీన్ పోలిశెట్టి గురించి ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీతో హీరోగా నిల‌దొక్కుకున్న న‌వీన్ పోలిశెట్టి.. జాతి రత్నాలుతో విప‌రీత‌మైన క్రేజ్ సంపాదించుకున్నాడు. గ‌త ఏడాది మిస్ట్ శెట్టి మిస్ట‌ర్ పోలిశెట్టి చిత్రంతో హ్యాట్రిక్ హిట్ ను ఖాతాలో వేసుకుని ఇండ‌స్ట్రీలో ప్ర‌త్యేక‌మైన ఫ్యాన్ బేస్ ను ఏర్ప‌ర్చుకున్నాడు. అయితే మిస్ట్ శెట్టి మిస్ట‌ర్ పోలిశెట్టి రిలీజ్ టైమ్ లో న‌వీన్ అమెరికాలో వెళ్లాడు.

ఆ త‌ర్వాత ఇండియాకు రాలేదు. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి ఎటువంటి అప్డేట్ లేదు. ఇంత‌లోనే అక్క‌డ ఓ యాక్సిడెంట్ జ‌ర‌గ‌డంతో.. న‌వీన్ పోలిశెట్టి తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. ముఖ్యంగా అత‌ని కూడి చేయి బాగా ఫ్యాక్చర్ అయింది. దాంతో న‌వీన్ ఇంటికే ప‌రిమితం అయ్యాడు. సోష‌ల్ మీడియా ద్వారా త‌న హెల్త్ అప్డేట్స్ ను పంచుకున్నాడు. పూర్తిగా కోలుకుని త్వరలోనే తెరపై కనిపిస్తానని హామీ ఇచ్చాడు. అయితే ఇంత‌లోనే న‌వీన్ పోలిశెట్టికి సంబంధించి ఓ షాకింగ్ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

న‌వీన్ పోలిశెట్టికి పెళ్లైపోయింద‌ని.. అమెరికాలో ఉంటున్న ఓ అమ్మాయిని అత‌ను సీక్రెట్ గా మ్యారేజ్ చేసుకున్నాడ‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. న‌వీన్ పెళ్లి జ‌రిగి చాలా నెల‌లు అయిందంటున్నారు. అందుకే న‌వీన్ అమెరికాలో ఉంటున్నాడ‌ని వార్త‌లు వ‌స్తున్నారు. అయితే ఈ వార్త‌ల‌ను న‌వీన్ పోలిశెట్టి కొట్టిపారేశాడు. త‌న‌కు పెళ్లైన‌ట్లు వ‌స్తున్న వార్త‌లు కేవ‌లం పుకార్లు మాత్ర‌మే అని.. నిజంగా మ్యారేజ్ చేసుకుంటే క‌చ్చితంగా అంద‌రికీ చెబుతాన‌ని పేర్కొన్నాడు.

ప్ర‌స్తుతం మూడు స్క్రిప్ట్ లు లైన్ లో ఉన్నాయ‌ని.. గాయాల నుంచి కోలుకున్న వెంట‌నే షూటింగ్స్ లో జాయిన్ అవుతాన‌ని న‌వీన్ పోలిశెట్టి చెప్పుకొచ్చాడు. కాగా, లాంగ్ గ్యాప్ అనంత‌రం న‌వీన్ పోలిశెట్టి రీసెంట్ గా హైద‌రాబాద్ లో జ‌రిగిన ఫిల్మ్‌ఫేర్ సౌత్ 2024 వేడుక‌ల్లో మెరిసి మాయం అయ్యారు. ఈ అవార్డు ఫంక్ష‌న్ తర్వాత న‌వీన్ అమెరికా వెళ్లాడా? లేక ముంబై వెళ్లాడా? అన్న‌ది మాత్రం ఎవ‌రికీ తెలియ‌దు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news