Moviesఆ హీరోతో లిప్‌లాక్.. లవర్‌తో బ్రేకప్.. సిమ్రాన్ స్యాడ్ లవ్ స్టోరీ..?

ఆ హీరోతో లిప్‌లాక్.. లవర్‌తో బ్రేకప్.. సిమ్రాన్ స్యాడ్ లవ్ స్టోరీ..?

సీనియర్ నటి సిమ్రాన్ ఇప్పటి జనరేషన్ కి కూడా తెలిసిన హీరోయిన్. గతంలో స్టార్ హీరోలైన చిరంజీవి,వెంకటేష్, నాగార్జున,బాలకృష్ణ వంటి హీరోలతో జతకట్టి స్టార్ స్టేటస్ సంపాదించింది. ఇక ఈమె హీరోయిన్ గా చేసిన సమరసింహారెడ్డి, కలిసుందాం రా, నువ్వు వస్తావని, బావ నచ్చాడు, సీతయ్య,యువరాజు, రాకుమారుడు, పంచతంత్రం వంటి ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఇక ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాదు మలయాళ,తమిళం ఇలా సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణించింది. అయితే అలాంటి సిమ్రాన్ అప్పట్లో డ్యాన్స్ మాస్టర్ అయిన రాజు సుందరంని చాలా గాఢంగా ప్రేమించింది.

ఇక వీరి రిలేషన్ పెళ్లి వరకు కూడా వెళ్లిన సమయంలో ఈ హీరోయిన్ వేరే హీరోతో చేసిన సినిమా కారణంగా ఇద్దరి మధ్య బ్రేకప్ జరిగిందట. ఇక విషయంలోకి వెళ్తే.. సిమ్రాన్ ఎంతోమంది హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది.అలా బాలకృష్ణ విజయశాంతితో హిట్టు పెయిర్ సంపాదించుకున్నాక ఆ తర్వాత జనరేషన్లో వచ్చిన హీరోయిన్లలో సిమ్రాన్ హిట్ పెయిర్ అని పేరు తెచ్చుకుంది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ కమల్ హాసన్ తో బ్రహ్మచారి, పంచతంత్రం, పమ్మల్ కె.సంబంధం వంటి తమిళ సినిమాల్లో నటించింది.

అయితే వరుసగా మూడు సినిమాల్లో నటించేసరికి కమల్ హాసన్ తో సిమ్రాన్ రిలేషన్ లో ఉంది అనే రూమర్స్ కూడా వినిపించాయి. అంతేకాకుండా సినిమా షూటింగ్స్ లో భాగంగా కమల్ హాసన్ తో కొన్ని రొమాంటిక్ సన్నివేశాలలో కూడా సిమ్రాన్ నటించిందట.కానీ తన ప్రేయసి మరో హీరో తో రొమాన్స్ చేయడం ఇష్టం లేని రాజు సుందరం అలాంటి సన్నివేశాల్లో నటించకని చెప్పారట. అయినా కూడా వినకుండా సిమ్రాన్ రొమాంటిక్ సన్నివేశాల్లో నటించింది. అంతేకాకుండా కమల్ హాసన్ తో ఓ మూవీ లో లిప్ లాక్ సన్నివేశంలో కూడా నటించింది.దాంతో ఓసారి సిమ్రాన్ రాజు సుందరం మధ్య ఇదే విషయంపై గొడవ జరిగిందట.

ఇక ఇన్ని గొడవలతో కలిసి ఉండడం అసంభవం అని రాజు సుందరం,సిమ్రాన్ ఇద్దరు బ్రేకప్ చెప్పుకున్నారట. అయితే సిమ్రాన్ మాత్రం సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలిసికూడా రాజు సుందరం తనని అపార్థం చేసుకుంటున్నాడని ఆయనతో బ్రేకప్ అయ్యాక సన్నిహితులకు ఈ విషయం చెబుతూ చాలా బాధపడిందనే రూమర్ కూడా వినిపించింది. అయితే అప్పట్లో వీరి మధ్య ప్రేమ, బ్రేకప్ గురించి సౌత్ ఇండస్ట్రీ మొత్తం కోడై కూసింది. కానీ దీనిపై సిమ్రాన్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.ఇక సిమ్రాన్ దీపక్ బగ్గా అనే వ్యక్తిని పెళ్లాడింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news